జయలలిత మృతి కేసులో వెలుగులోకి సంచలన విషయాలు

Submitted by arun on Sun, 10/07/2018 - 10:06
jaya

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. జయ మృతిపై నెలకొన్న అనుమానాలపై విచారణ జరుపుతోన్న కమిషన్‌కు ఐదు పేజీల నివేదిక ఇచ్చిన చెన్నై అపోలో ఆస్పత్రి యాజమాన్యం... జయలలితను ఆస్పత్రికి తీసుకొచ్చే సమయంలోనూ, ట్రీట్‌మెంట్‌ జరుగుతోన్న టైమ్‌లోనూ సీసీటీవీ కెమెరాలు ఆపేయాల్సిందిగా నలుగురు పోలీస్‌ ఉన్నతాధికారులు తమను కోరినట్లు తెలిపింది. ఇందులో జయ వ్యక్తిగత సెక్యూరిటీ ఆఫీసర్లతోపాటు ఇంటలిజెన్స్‌ ఐజీ సత్యమూర్తి ఉన్నారని తెలిపింది. అందుకే హాస్పిటల్‌ కారిడార్‌లో సీసీ కెమెరాలు స్విచ్ఛాఫ్‌ అయినట్లు తెలిపారు.
 

English Title
Cops Told Us To Turn Off CCTV Cameras: Hospital In Jayalalithaa Probe

MORE FROM AUTHOR

RELATED ARTICLES