ఊహించని మలుపులు తిరిగిన సభ్యత్వ రద్దు కేసు

ఊహించని మలుపులు తిరిగిన సభ్యత్వ రద్దు కేసు
x
Highlights

కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌ల సభ్యత్వ రద్దుపై కాసేపట్లో తీర్పు వెలవడనుంది. హైకోర్టు నిర్ణయంపై అటు కాంగ్రెస్‌, ఇటు టీఆర్ఎస్ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ...

కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌ల సభ్యత్వ రద్దుపై కాసేపట్లో తీర్పు వెలవడనుంది. హైకోర్టు నిర్ణయంపై అటు కాంగ్రెస్‌, ఇటు టీఆర్ఎస్ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తమ సభ్యత్వాలను రద్దు చేస్తూ స్పీకర్ తీసుకున్న నిర్ణయంపై వీరిద్దరూ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ సందర్భంగా కేసు పలు మలుపులు తిరిగింది. విచారణ సందర్భంగా ఘటన జరిగిన రోజు శాసనసభలో వీడియోలను తమకు ఇవ్వాలంటూ కోర్టు ఆదేశించింది. దీనికి అడ్వకేట్ జనరల్ అంగీకరించినా తరువాత జరిగిన పరిణామాల్లో తన పదవికి రాజీనామా చేయడంతో విచారణకు బ్రేక్ పడింది. చివరకు వీడియోలు లేకుండానే విచారణ జరిపిన న్యాయస్ధానం తీర్పు ఈ రోజుకు రిజర్వ్ చేసింది. కోమటిరెడ్డి, సంపత్‌ల తరపున ప్రముఖ న్యాయవాది జంధ్యాల రవిశంకర్ వాదించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories