రాంమోహన్ రెడ్డి భార్యపై కాంగ్రెస్ కార్యకర్త దురుసు ప్రవర్తన..

రాంమోహన్ రెడ్డి భార్యపై కాంగ్రెస్ కార్యకర్త దురుసు ప్రవర్తన..
x
Highlights

చెదురుముదురు ఘటనలు మినహా తెలంగాణ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. అయితే కొన్నిచోట్ల కాంగ్రెస్, టీడీపీల మధ్య ఘర్షణలు చోటుచేసుకుంటే.. మరికొన్నిచోట్ల తీవ్ర...

చెదురుముదురు ఘటనలు మినహా తెలంగాణ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. అయితే కొన్నిచోట్ల కాంగ్రెస్, టీడీపీల మధ్య ఘర్షణలు చోటుచేసుకుంటే.. మరికొన్నిచోట్ల తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.

మహబూబ్‌నగర్‌ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డిపై దాడి జరిగింది. ఆమనగల్లు మండలంలోని జంగారెడ్డిపల్లిలో పోలింగ్‌ బూత్‌ను పరిశీలించడానికి వెళ్లిన వంశీ చంద్ రెడ్డిపై కొందరు దుండగులు రాళ్లతో దాడి చేసి పారిపోయారు. దాంతో ఆయన స్పృహతప్పి పడిపోయారు. హైదరాబాద్ లోని నిమ్స్ లో ఆయనకు చికిత్స జరిగింది.

మహబూబ్‌నగర్‌ జిల్లా నవాబ్‌పేట పోలింగ్‌ కేంద్రంలోటీఆర్‌ఎస్ , కాంగ్రెస్‌ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఓటరు జాబితాపై చెలరేగిన వివాదంతో ఒకరిపై మరొకరు దాడికి పాల్పడ్డారు.

మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ నియోజకవర్గం ఆత్మకూరులో టీఆర్‌ఎస్‌ ప్రజాకూటమి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో అక్కడ ఉత్రిక్త పరిస్థితి నెలకొంది. ఈగ్రామంలో పోలింగ్ బూత్‌ 204ను పరిశీలించడానికి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి రాంమోహన్ రెడ్డి భార్య సుచరితను కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు ఆమెపై దురుసుగా ప్రవర్తించడంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. ఆవేశానికి గురై టీఆర్‌ఎస్‌ మండల ప్రెసిడెంట్‌పై దాడికి దిగారు.

నిజామాబాద్‌లోని మోపాల్‌ మండలం ఎల్లమ్మ కుంటలో టీఆర్‌ఎస్‌-కాంగ్రెస్‌ వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలయ్యాయి.

ఇక మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. కార్వాన్‌లో పోలింగ్ ఆలస్యంగా నిర్వహించడంపై బీజేపీ అభ్యర్థి అమర్‌ సింగ్‌ ఆందోళనకు దిగారు. మహాకూటమి నాయకులపై బీజేపీ అభ్యర్థి బద్దం బాల్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్‌రెడ్డి నియోజకవర్గం కొడంగల్‌లో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. 233 పోలింగ్‌ కేంద్రంలో మూడో నంబర్‌ మీట నొక్కాలంటూ మహిళా, వృద్ధ ఓటర్లపై పోలింగ్‌ సిబ్బంది ఒత్తిడి తెస్తున్నారంటూ కాంగ్రెస్‌ నేతలు అభ్యంతరం వ్యక్తంచేశారు. దీంతో టీఆరెస్, కాంగ్రెస్ కార్యకర్తలమధ్య తోపులాట జరిగింది.

నియోజకవర్గ కేంద్రమైన ఖానాపూర్లో టీఆర్ఎస్-కాంగ్రెస్ వర్గీయుల మధ్య ఘర్షణ, తోపులాట జరిగింది. ఇక సీఎం నియోజకవర్గమైన గజ్వేల్ లోని బండమైలారంలో కాంగ్రెస్, తెరాస నాయకుల పోటాపోటీ నినాదాలు చేశారు. దాంతో పోలీసులు తమ లాఠీలకు పనిచెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories