పెళ్లిపీటలెక్కనున్న స్టార్‌ కమెడియన్‌!

Submitted by arun on Tue, 10/09/2018 - 10:54
Kapil Sharma

స్టార్‌ కమెడియన్‌, బాలీవుడ్‌ నటుడు కపిల్‌ శర్మ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నాడు. డిసెంబరులో తన గర్ల్‌ఫ్రెండ్ జిన్నీని కపిల్‌ వివాహమాడనున్నట్లు అతడి సన్నిహితులు మీడియాకు తెలిపారు. ఆయ‌న కొన్నాళ్ళుగా గిన్నీ ఛ‌త్రాత్‌తో ప్రేమాయ‌ణం కొన‌సాగిస్తున్నాడు. డిసెంబ‌ర్‌లో పంజాబీ సంప్ర‌దాయం ప్ర‌కారం వీరి పెళ్ళి జ‌ర‌గ‌నున్న‌ట్టు తెలుస్తుంది. నాలుగు రోజుల పాటు అమృత్ స‌ర్‌లో ఈ పెళ్లి వేడుక జ‌ర‌గనున్న‌ట్టు స‌మాచారం. వీరి వివాహానికి బాలీవుడ్‌కి సంబంధించిన న‌టీన‌టులు హాజ‌రు కానున్నార‌ని స‌మాచారం. అలాగే ముంబైలో త‌న స‌న్నిహితులు, కొంద‌రు స్టార్స్‌కి క‌పిల్ భారీ పార్టీ ఏర్పాటు చేయ‌నున్నాడ‌ని అంటున్నారు. కాగా ‘కామెడీ నైట్స్‌ విత్‌ కపిల్‌’ షోతో ఫేమస్‌ అయిన కపిల్‌ శర్మ స్టార్‌ కమెడియన్‌గా గుర్తింపు పొందాడు. ఒక షోకు అత్యంత ఎక్కువ పారితోషికం తీసుకుంటున్న కమెడియన్‌గా కూడా రికార్డు సృష్టించాడు. పలు బాలీవుడ్‌ సినిమాలలో కూడా నటించిన కపిల్‌.. ‘సన్‌ ఆఫ్‌ మంజీత్‌ సింగ్‌’  అనే సినిమాతో నిర్మాతగా మారాడు. ఈ సినిమా అక్టోబరు 12న విడుదల కానుంది. ఇక జిన్నీతో తనకున్న అనుబంధాన్ని 2017లో ట్విటర్‌ వేదికగా కన్ఫామ్‌ చేసిన కపిల్‌ త్వరలోనే ఆమెను పెళ్లాడనున్నాడు.
 

English Title
Comedian Kapil Sharma to marry girlfriend Ginni

MORE FROM AUTHOR

RELATED ARTICLES