ఫింఛన్ ఇచ్చి.. అవ్వకి బువ్వ పెట్టిన కలెక్టర్

ఫింఛన్ ఇచ్చి.. అవ్వకి బువ్వ పెట్టిన కలెక్టర్
x
Highlights

ఎవ్వరూ తోడు లేరు. ఒంటరిగా జీవితం గడుపుతుంది. ఎలాగున్నావ్ అని పలకరించేవాళ్లు లేకపోయినా గుండె ధైర్యంతో ఒంటరిగా కాలం వెళ్లదీస్తున్న ఆ అవ్వకు నేనున్నానని...

ఎవ్వరూ తోడు లేరు. ఒంటరిగా జీవితం గడుపుతుంది. ఎలాగున్నావ్ అని పలకరించేవాళ్లు లేకపోయినా గుండె ధైర్యంతో ఒంటరిగా కాలం వెళ్లదీస్తున్న ఆ అవ్వకు నేనున్నానని జిల్లా కలెక్టర్ భరోసా ఇచ్చారు. అంతేకాదు స్వయంగా ఆమె ఇంటికి పెన్షన్ డబ్బులు చేతిలో పెట్టాడు. అందరి హృదయాలను గెల్చుకున్న ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

కరూర్ జిల్లా చిన్నమనాయకన్ పట్టికి చెందిన రాఘమ్మాళ్ వయస్సు 80 ఏళ్లు. ఆ అవ్వకు ఎవ్వరూ తోడు లేరు. ఒంటరిగా జీవితం గడుపుతోంది. ఎలాగున్నావ్ అని పలకరించేవాళ్లు లేకపోయినా గుండె ధైర్యంతో ఒంటరిగా కాలం వెళ్లదీస్తోంది. ప్రభుత్వం ప్రతినెలా వృద్ధాప్య ఫింఛన్ ఇస్తోంది. అయితే వారం రోజులుగా విపరీతమైన ఎండలతో బయటకు వెళ్లలేకపోతోంది. కొన్ని రోజులుగా ఆరోగ్యం సహకరించక పింఛను తీసుకోవడానికి వెళ్లలేకపోయింది. విషయం తెలుసుకున్న కలెక్టర్ అన్ బజగాన్ స్పందించారు. ఆ అవ్వకు నేనున్నానని భరోసా ఇచ్చారు. అంతేకాదు ఏప్రిల్ 3వ తేదీ స్వయంగా ఆమె ఇంటికి వెళ్లి పెన్షన్ డబ్బులు చేతిలో పెట్టాడు. తను ఇంటి నుంచి తీసుకెళ్లిన భోజనంను ఆమెకు కూడా వడ్డించారు. అరటి ఆకులో వేసి.. అందులో అవ్వకి కూడా బువ్వ పెట్టారు. ఆ అవ్వకు తనే స్వయంగా తినిపించారు. ఏ కష్టం వచ్చినా నా దగ్గరకి వచ్చేయండి అంటూ అవ్వకి భరోసా ఇచ్చారు. కలెక్టర్ సహృదయత చాలామందిని కదిలించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories