చింతమడకలో ఓటు వేసిన సీఎం కేసీఆర్‌ దంపతులు

Submitted by arun on Fri, 12/07/2018 - 12:38
kcr

చింతమడకలో ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎర్రవల్లిలో ఆయన ఫాంహౌస్ నుంచి ప్రత్యేక హెలీకాఫ్టర్‌లో చింతమడక చేరుకున్న కేసీఆర్ ఆయన సతీమణితో కలిసి చింతమడక జెడ్పీ హైస్కూల్లో ఓటు వేశారు. కేసీఆర్ దంపతులతో పాటు మంత్రి హరీష్‌రావు, టీఆర్ఎస్ సీనియర్‌ నేతలు చింతమడకకు చేరుకున్నారు. ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం కేసీఆర్ తన చిన్ననాటి స్నేహితుడు సత్యనారాయణ గౌడ్ నివాసానికి వెళ్లనున్నారు. అనంతరం కేసీఆర్ తిరిగి ఫాంహౌస్‌కు వెళ్లనున్నారు.

English Title
cm kcr cast his vote

MORE FROM AUTHOR

RELATED ARTICLES