టీ టీడీపీ నేతలతో ముగిసిన చంద్రబాబు భేటి ..

x
Highlights

మహాకూటమి పొత్తులపై సీఎం చంద్రబాబు టీ టీడీపీ నేతలకు దిశానిర్దేశం చేశారు. పోటీ చేసే స్ధానాలు, అభ్యర్ధుల ఎంపికపై పోలీట్ బ్యూరోలో సుమారు గంట పాటు ఆయన...

మహాకూటమి పొత్తులపై సీఎం చంద్రబాబు టీ టీడీపీ నేతలకు దిశానిర్దేశం చేశారు. పోటీ చేసే స్ధానాలు, అభ్యర్ధుల ఎంపికపై పోలీట్ బ్యూరోలో సుమారు గంట పాటు ఆయన చర్చించారు. ఈ సందర్భంగా పలు కీలకమైన అంశాలను ప్రస్తావించిన చంద్రబాబు ప్రస్తుత సమయంలో సీట్ల కంటే టీఆర్ఎస్‌ను గద్దె దింపడమే లక్ష్యంగా పని చేయాలంటూ సూచించారు. సీట్ల సర్ధుబాటు, పొత్తులపై కాంగ్రెస్ నేతలు తనతో చర్చించారన్న చంద్రబాబు 12 స్ధానాలు ఇస్తామని ఆఫర్ చేసినట్టు తెలిపారు. అయితే తమకు బలమున్న స్ధానాల్లో పోటీ చేసేలా అవకాశమివ్వాలని తాను కోరినట్టు నేతలకు వివరించారు.

చంద్రబాబుతో భేటి సందర్భంగా టీడీపీకి బలమున్న స్ధానాలతో పాటు పోటీ చేయాలనుకుంటున్న స్ధానాలపై టీ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ నివేదిక అందజేశారు. గ్రేటర్‌తో పాటు ఏపీ సరిహద్దుతో కూడిన జిల్లాల్లో పార్టీ బలంగా ఉందని వివరించారు. ఇలాంటి చోట పోటీ చేయాలని పట్టుబట్టారు. 25 నుంచి 30 స్ధానాలు కోరాలని మధ్యే మార్గంగా 18 చోట్ల ఖచ్చితంగా పోటీ చేయాలని ఆయన చంద్రబాబుకు వివరించారు. ఈ దశలో జోక్యం చేసుకున్న చంద్రబాబు టీడీపీతో పొత్తు వల్ల కాంగ్రెస్‌ రాష్ట్రమంతా ప్రయోజనం పొందుతుందని ఈ విషయాన్ని తెలియజేస్తూ మరో ఆరు సీట్లు అడగాలని సూచించారు. అనంతరం సెంట్రల్ కమిటీ సభ్యులతో చంద్రబాబు సమావేశమయ్యారు.

Show Full Article
Print Article
Next Story
More Stories