ఇకపై స్కార్ఫ్ ధరించారా..

ఇకపై స్కార్ఫ్ ధరించారా..
x
Highlights

కొంతమంది ఆడవాళ్లు బయటికి వెళ్లే సమయాల్లో ఎక్కువగా ముఖానికి స్కార్ఫ్ ధరించి వెళుతుంటారు. అయితే గతంలో ఇలా ధరించడం వలన అసాంగిక శక్తులు జనాలలోకి...

కొంతమంది ఆడవాళ్లు బయటికి వెళ్లే సమయాల్లో ఎక్కువగా ముఖానికి స్కార్ఫ్ ధరించి వెళుతుంటారు. అయితే గతంలో ఇలా ధరించడం వలన అసాంగిక శక్తులు జనాలలోకి ప్రవేశించే ప్రమాదం ఉందని పోలీసులు, ప్రభుత్వాలు భావించాయి. కానీ దీనిపై తరువాత ఏ నిర్ణయమూ తీసుకోలేదు.. ఇదిలావుంటే మీరట్‌లోని చౌదరి చరణ్‌ సింగ్‌ విశ్వవిద్యాలయం విద్యార్థులు స్కార్ఫ్ ధరించి క్యాంపస్‌లోకి ప్రవేశించకూడదనే నిభందనను అమల్లోకి తీసుకువచ్చింది. భద్రతపరమైన చర్యల దృష్ట్యానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వర్సిటీ అధికారులు వెల్లడించారు. "స్కార్ఫ్‌ ధరించి యూనివర్సిటీలోకి ప్రవేశించడం వలన క్యాంపస్‌కు చెందిన విద్యార్థినులా లేక బయటి వారా అనే విషయం గుర్తించడంలో సెక్యూరిటీకి కష్టమవుతుంది. అందువల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది' అని వర్సిటీ అధికారులు తెలిపారు. ఇకపై స్కార్ఫ్ ధరిస్తే చర్యలు ఉంటాయని వారు విద్యార్థులకు సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories