ట్వీట్ల పిట్టలు...మోతెక్కి పోతున్న ట్విట్టర్ పేజీలు

ట్వీట్ల పిట్టలు...మోతెక్కి పోతున్న ట్విట్టర్ పేజీలు
x
Highlights

ప్రపంచం మారిపోతోంది.. నచ్చిన అంశాన్ని.. అప్పటికప్పుడు షేర్ చేసేసుకోడానికి సోషల్ మీడియా వేదికగా మారుతోంది.. సంతోషం, విషాదం.. ఆక్రోశం, ఆవేశం.....

ప్రపంచం మారిపోతోంది.. నచ్చిన అంశాన్ని.. అప్పటికప్పుడు షేర్ చేసేసుకోడానికి సోషల్ మీడియా వేదికగా మారుతోంది.. సంతోషం, విషాదం.. ఆక్రోశం, ఆవేశం.. ఏదయితేనేం.. షేర్ ఇట్ విత్ పీపుల్.. రాజకీయ నాయకులు, సినీతారలు, సెలబ్రిటీలు అందరూ వినియోగించే ఒకే ఒక్క సాధనం ట్విట్టర్.. ఈ సెలబ్రిటీల కూతలతో.. ట్విట్టర్ పేజ్ లు కిచకిచ లాడిపోతున్నాయ్.. ఇంతకీ ఏ లీడర్ ఫాలోయింగ్ ఎంత?

ఓ నినాదం.. ఓ ఆవేశం.. ఓ ఆక్రోశం.. ఓ.. విమర్శ.. ఏదయితేనేం. క్షణాల్లో ప్రపంచం మొత్తం ఎలుగెత్తి వినిపించడానికి ఇప్పుడు అందుబాటులో ఉన్న సంక్షిప్త సాధనం ట్విట్టర్.. మనదేశంలో మోడీ, బిగ్ బి, షారూక్.. ఈ ముగ్గురే లార్జెస్ట్ ఆడియన్స్ ని కలిగిన ట్విట్టర్ వీరులు.. మరి మిగిలిన నేతలు ట్విట్టర్ వాడకంలో ఏ పొజిషన్ లో ఉన్నారు? మన యువనేతలకు సోషల్ మీడియాపై ఉన్న పట్టు ఏ పాటిది?

వారంతా సెలబ్రిటీస్..వారో మాట చెప్పారంటే.. ప్రపంచమంతా వారిని ఫాలో కావాల్సిందే.. వారో కామెంట్ చేశారంటే.. దానిని చూసేందుకు లక్షలు.. కోట్లల్లో జనం ఎగబడిపోతారు.. వారి సంక్షిప్త సందేశాలకు ఫాలోయర్లు కూడా లక్షల్లో ఉంటారు. సోషల్ మీడియాలో ట్విట్టర్ చేస్తున్న హడావిడి అంతా ఇంతా కాదు.. చిన్న పిచ్చుక గోల లాంటి ఈ మీడియా సంక్షిప్త సందేశాలకు, చురకలకు, కామెంట్లకు, సెటైర్లకు పెట్టింది పేరు..ఏ ఇంపార్టెంట్ విషయంపైనైనా మనం చేసిన కామెంట్, లేదా మన అభిప్రాయం వేగంగా జన సామాన్యంలోకి వెళ్లాలనుకుంటే అందుకు ట్విట్టర్ ను మించిన సాధనం లేదు.. ప్రపంచ వ్యాప్తంగా ట్విట్టర్ ఖాతాదారులు కొన్ని కోట్లలో ఉన్నారు.. వారిలో సెలబ్రిటీల ఖతాలకి మరీ ముఖ్యంగా ఎక్కడలేని డిమాండ్.. వాళ్లకి ఫాలోయర్లు కూడా ఎక్కువమందే ఉంటారు.. ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్ వీరులు చాలా మందే ఉన్నా మన దేశానికి వచ్చే సరికి ప్రధాని నరేంద్ర మోడీ అందరికన్నా ముందున్నారు.. మోడీ అటు ప్రసంగాల్లోనూ దిట్టే.. చురకలంటించడంలోనూ చిరుత వేగమే.. గత దశాబ్ద కాలంగా ఆయనేం చెప్పినా మోత మోగిపోతోంది.

మోడీ ట్విట్టర్ ఖాతాకు ఎక్కడలేని డిమాండ్ ఉంది.. ఆయనకు ఫాలోయర్లు కూడా చాలా చాలా ఎక్కువ. మోడీ ట్విట్టర్ ను మొత్తంగా మూడు కోట్ల95లక్షల 31 వేల660 మంది చూస్తున్నారు. కాగా వెయ్యి 859 మందిని ఆయన ఫాలో అవుతున్నారు... ప్రత్యర్ధి రాహుల్ ను పదునైన చురకలతో మోడీ చేసే ట్వీట్లకు మంచి స్పందన వస్తుంటుంది.. ఈ మధ్య కాలంలో ట్విట్టర్ లో యమాస్పీడ్ గా దూసుకుపోతున్నది మోడీ మాత్రమే. ఆయన ట్విట్టర్ గ్రాఫ్ రోజురోజుకీ పైపైకి పోతోంది. అంతేకాదు.. మోడీ ఆధ్వర్యంలోని పిఎంఓ కార్యాలయం ట్విట్టర్ ఖాతా కూడా అదే స్పీడులో దూసుకుపోతోంది.. ఈవారం దాదాపు 29 వేల 566 మంది అదనంగా ఈ ఖాతాకు ఫాలోయర్లుగా మారారు.

మోడీకి ప్రధాన ప్రత్యర్ధి రాహుల్ మాత్రం ట్విట్టర్ ఎక్కౌంట్ వినియోగంలో బాగా వెనకబడిపోయారు ఘనమైన పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్, ప్రధాని అభ్యర్ధి అన్న ట్యాగ్ లైన్ ఉండి కూడా రాహుల్ తన ట్విట్టర్ లో 34 లక్షలమంది ఫాలోయర్లను మాత్రమే సంపాదించగలిగారు ఈ నెంబర్ కూడా తప్పుడుదేనంటూ బిజెపి ఆరోపిస్తోంది. ఇక ట్విట్టర్ ఖాతాలో మోడీ తర్వాత స్థానం బిగ్ బి అమితాబ్ బచ్చన్ ది.. బిగ్ బికి ప్రపంచ వ్యాప్తంగా మూడు కోట్ల28 లక్షల 96 వేల 43 మంది ఫాలోయర్లున్నారు ఇక వెయ్యి 169 మందిని బిగ్ బి ఫాలో అవుతున్నారు బిగ్ బి సామాజికాంశాలపైనా, మానవ సంబంధలపైనా, సున్నితమైన అంశాలపైనా తరచుగా స్పందిస్తుంటారు.

ఇక తెలుగు రాజకీయ నాయకుల విషయానికొస్తే తెలుగు రాష్ట్రాల సీఎం లిద్దరూ ట్విట్టర్ ఖాతాలో సైతం పోటీ పడుతున్నారు కేసిఆర్ కు వ్యక్తిగతంగా ట్విట్టర్ ఖాతా లేకపోయినా ఆయన కార్యాలయం పేరు మీద ఒక ఎక్కౌంట్ రన్ అవుతోంది దానికి 12 లక్షల మంది ఫాలోయర్లుండగా 15 మందిని ఆ ఖాతా ఫాలో అవుతున్నట్లుగా ఉంది. ఏపి సీఎం చంద్రబాబునాయుడు కు సోషల్ మీడియాపై పట్టు, అవగాహనా ఎక్కువే ఆయన పేరు మీద రన్ అవుతున్న ట్విట్టర్ ఖాతాకు 30 లక్షల 45 వేల మంది ఫాలోయర్లున్నారు ప్రభుత్వ విధానాల వెల్లడికే కాదు అప్పుడప్పుడు కొన్ని వ్యక్తిగత విషయాలకూ ఆయన ట్విట్టర్ వాడుతుంటారు జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు చెప్పినది ట్విట్టర్ వేదికగానే కాగా చంద్రబాబు ఖాతా ఫాలో అవుతున్నది మాత్రం ఇద్దరినే.

ఇక యువనేతల విషయానికొస్తే తెలుగు రాష్ట్రాల్లో ట్విట్టర్ జోరులో తెలంగాణ ఐటి మంత్రి కేటిఆర్ ది అగ్రస్థానం కేటిఆర్ సోషల్ మీడియాను విపరీతంగా వాడుతుంటారు ప్రభుత్వ విధానాల దగ్గర నుంచి సమస్యల పరిష్కారానికీ, తన భావనను వ్యక్తం చేయడానికీ ట్విట్టరే ఆయన సాధనం. కేటిఆర్ కు 9 లక్షల 29 వేల మంది ఫాలోయర్లుండగా ఆయన 58 మందిని ఫాలో అవుతున్నారు. ఆ తర్వాత స్థానం ఏపి ప్రధాన ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్ ది..ఆయనకు 5 లక్షల 2 వేల 419 మంది ట్విట్టర్ ఫాలోయర్లున్నారు కాగా జగన్ 7 మందిని ఫాలో అవుతున్నారు జగన్ పాదయాత్ర మొదలు పెట్టాక సోషల్ మీడియా యాక్టివిటీ పెరిగింది ఆయన పాదయాత్రను వివిధ కోణాల్లో సోషల్ మీడియా ప్రజలకు చేరవేస్తోంది. ప్రత్యర్ధి సీఎం చంద్రబాబు పాలనపై జగన్ ట్విట్టర్ వేదికగానే ఘాటైన విమర్శలు చేస్తుంటారు. ఇక తెలుగు దేశం యువనేత, చంద్రబాబు కుమారుడు, ఐటి మంత్రి లోకేష్ కు ట్విట్టర్ ఎక్కౌంట్ లో3 లక్షల 52 వేల మంది ఫాలోయర్లున్నారు లోకేష్ కూడా తెలుగు దేశం ప్రభుత్వం పనితీరును చెప్పుకోడానికి, ప్రజాసమస్యల పరిష్కారానికి తరచుగా ట్విట్టర్ వాడుతుంటారు ఆయన 43 మందిని ఫాలో అవుతున్నారు.

వాడటం అంటూ మొదలు పెడితే తమ తరవాతే ఎవరైనా అంటున్నారు ఖాన్ త్రయం షారూక్, సల్మాన్, ఆమీర్ ముగ్గురూ సోషల్ మీడియా దుమ్ము రేపుతున్నారు మరి ఇతర సెలబ్రిటీల సంగతేంటి?

సోషల్ మీడియాలో ఖాన్ ల త్రయానిది సెపరేట్ ట్రెండ్ ట్విట్టర్ వీరుల్లో బిగ్ బి తర్వాత స్థానం షారూఖ్ ఖాన్ దే షారూక్ కు ప్రపంచ వ్యాప్తంగా మూడు కోట్ల 26 లక్షల 62 వేల 612 మంది ఫాలోయర్లున్నారు. కానీ కింగ్ ఖాన్ ఫాలో అయ్యేది మాత్రం చాలా కొద్ది మందినే కేవలం 78 మందిని మాత్రమే షారూక్ ఫాలో అవుతున్నారు. ఇక మరో వివాదస్పద సెలబ్రిటీ సల్మాన్ ఖాన్ ఆయనకు మూడుకోట్ల
4 లక్షల 57 వేల 977 మంది వ్యూయర్లుంటే కేవలం 22మందిని మాత్రమే ఆయన ఫాలో అవుతున్నారు. కొత్త పంథా సినిమాలతో ఆలోచింప చేసే నటుడు, సామాజిక ఉద్యమకారుడు ఆమీర్ ఖాన్ కు కూడా ట్విట్టర్ ఫాలోయింగ్ ఎక్కువే ఆయన ఎక్కౌంట్ ను2 కోట్ల,27 లక్షల 7 వేల 181 మంది ఫాలో అవుతుంటే ఆమీర్ 9 మందిని మాత్రమే ఫాలో అవుతున్నారు. నటుడు అనుపమ్ ఖేర్ కు కోటీ17 లక్షల46 వేల849 మంది ఫాలోయర్లుండగా 132 మందిని ఆయన ఫాలో అవుతున్నారు సామాజికాంశాలపై అనుపమ్ చాలా తరచుగా స్పందిస్తూంటారు.

సెలబ్రిటీల్లో క్రికెటర్ల ట్విట్టర్ ఖాతాలూ ఓ రేంజ్ లో దూసుకు పోతున్నాయి. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ క్రికెట్ లోనే చిచ్చర పిడుగు కాదు. ట్విట్టర్ ఖాతా మెయిన్ టెనెన్స్ లో కూడా సూపరే ఆయనకు రెండు కోట్ల మంది ఫాలోయర్లున్నా ఆయన ఫాలో అవుతున్నది మాత్రం 80 మందినే. టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ భార్య అనుష్క శర్మకి కూడా చెప్పుకోదగ్గ స్థాయిలోనే ట్విట్టర్ ఫాలోయర్లున్నారు ఆమెకు కోటీ 48 లక్షల 36 వేల 445 మంది ఫాలోయర్లుండగా అనుష్క 133 మందిని ఫాలో అవుతున్నారు.

బాహుబలిగా నిరూపించుకున్న ప్రభాస్ కి సోషల్ మీడియాపై ఉన్న పట్టెంత? డార్లింగ్ ని ఫాలో అయ్యేదెవరు? ట్విట్టర్ ఖాతాలో నాగ్ ఫ్యామిలీ రేంజ్ ఏంటి? కుర్ర నటుల హవా ఏ మేరకుంది? ప్రిన్స్ ట్విట్టర్ పేజ్ మైలేజ్ ఎంత?

తెలుగు నటులలో సోషల్ మీడియాలో కాస్త స్పీడుగా ఉండే నటుల్లో నాగార్జున అక్కినేని, మహేష్ బాబు, పవన్ కల్యాణ్, ముందు వరసలో ఉంటారు. సోషల్ మీడియాలో అక్కినేని వారి ట్విట్టర్ ఖాతా బరువు గానే కనిపిస్తుంది నాగార్జునకు 48 లక్షల 49 వేల244 మంది ట్విట్టర్ ఫాలోయర్లున్నారు ఆయన ఫాలో అయ్యేది మాత్రం ఒకే ఒక్కడిని. ఇక నాగార్జున పెద్ద కొడుకు, సమంత భర్త అక్కినేని నాగ చైతన్య కు 11 లక్షల 5 వేల879మంది ట్విట్టర్ ఫాలోయర్లున్నారు చైతు 127 మందిని ఫాలో అవుతున్నాడు. అందాల నటి, అక్కినేని వారి కోడలు సమంతకు కూడా చెప్పుకోదగ్గ సంఖ్యలోనే ట్విట్టర్ ఫాలోయర్లున్నారు సమంతకు 5 లక్షల 99 వేల 610మంది ఫాలోయర్లుండగా ఆమె194 మందిని ఫాలో అవుతోంది. చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తున్న సమంత సామాజిక సేవలోనూ తనదైన ముద్రవేశారు లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్ పేరుతో చిన్న పిల్లలకు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అంతేకాదు ఈ మధ్యే పెళ్లి చేసుకున్న సమంత అప్పుడప్పుడు జీవితంలో తాననుభవించే చిన్న చిన్న సంతోషాలనూ ట్విట్టర్ లో పంచుకుంటుంది చైతుతో తన స్నేహాం, ప్రేమ, పెళ్లి, అనంతర జీవితంపై అన్ని అనుభూతులు, అభిప్రాయాలు అన్నీ సమంత ట్విట్టర్ ఖాతాలోనే షేర్ చేసుకుంటోంది. హల్లో ఫేమ్, నాగార్జున చిన్న కొడుకు అఖిల్ అక్కినేని సినిమాల్లో ఇంకా దూకుడు చూపించకపోయినా ట్విట్టర్ ఖాతాలో మాత్రం అగ్రనటులతో సమానంగా ఫాలోయర్లను మెయిన్ టెయిన్ చేస్తున్నాడు. అఖిల్ కు 18 లక్షల13 వేల71 మంది ఫాలోయర్లుండగా 60 మందిని ఈ కుర్ర హీరో ఫాలో అవుతున్నాడు.

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా మంచి పేరు తెచ్చుకున్నా సోషల్ మీడియాను వాడటం కాస్త తక్కువనే చెప్పాలి. ఎప్పుడో కానీ మహేష్ పెద్దగా ట్వీట్ చేయడు. అప్పుడెప్పుడో జల్లి కట్టుపై తమిళనాడు ప్రజల స్ఫూర్తిని మెచ్చకుని కావలసినంత చిచ్చు రాజేసి ఆపై మౌనం దాల్చాడు మహేష్ కు 53 లక్షల 50వేల 776 మంది ఫాలోయర్లుండగా మహేష్ కేవలం ఒకే ఒక్కరిని ఫాలో అవుతున్నాడు.
ఇలా ఒకే ఒక్కరిని ఫాలో అయ్యే హీరో మరొకరున్నారు ఆయనే బాక్సాఫీస్ దుమ్ము దులిపే హీరో అల్లూ అర్జున్. ట్విట్టర్లో ఆయనకు 18 లక్షల 54 వేల 434 మంది ఫాలోయర్లుండగా బన్నీ కేవలం ఒకే ఒక్కరిని ఫాలో అవుతున్నారు. కథలను ఎంపిక చేసుకునే విషయంలో వైవిధ్యం ప్రదర్శించే రానా సోషల్ మీడియాలో యమ యాక్టివ్. భల్లాల దేవుడు దగ్గుబాటి రానాకు 47 లక్షల 78 వేల793 మంది ఫాలోయర్లుండగా రానా 267 మందిని ఫాలో అవుతున్నారు. డార్లింగ్ ప్రభాస్ కి ట్విట్టర్ లో 11 లక్షల మంది ఫాలోయర్లున్నారు. కానీ ఆయన ఫాలో అవుతున్నది మాత్రం ఇద్దరినే బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ ట్విట్టర్ పేజ్ బాలీవుడ్ తారలతో స్పీడుగా దూసుకుపోయింది.

నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ కు చెప్పుకోదగ్గ రీతిలో ట్విట్టర్ ఫాలోయర్లున్నారు వరుణ్ కు10 లక్షల 70 వేల834 మంది ఫాలోయర్లున్నారు ఆయన 39 మందిని ఫాలో అవుతున్నారు. అల్లరి నరేష్ కు పదిలక్షల 92 వేల 422 మంది ఫాలోయర్లున్నారు ఆయన 598 మందిని ఫాలో అవుతున్నారు. సాయిధరమ్ తేజ్ కు 8 లక్షల 68 వేల 103 మంది ఫాలోయర్లుండగా ధరమ్ తేజ్ 41 మందిని ఫాలో అవుతున్నాడు. వచ్చినది తక్కువ సినిమాల్లోనే అయినా తానేంటో నిరూపించుకున్న నటుడు రాజ్ తరుణ్. సినిమా చూపిస్త మావా అనే ఈ హీరోకు 3 లక్షల 50 వేల 37 మంది ఫాలోయర్లున్నారు తక్కువ కాలంలోనే పాపులర్ అవడమే కాదు ఫాన్ ఫాలోయింగ్ ను కూడా కూడగట్టుకున్న రాజ్ తరుణ్ 129మందిని ఫాలో అవుతున్నాడు. 95 శాతం మంది రాజకీయ నాయకులంతా రాస్కెల్సే నని తేల్చేసిన డైలాగ్ కింగ్ మోహన్ బాబు సోషల్ మీడియాలో వెరీ వెరీ పూర్ ఆయనకు ఆరు లక్షల 44 వేల 701 మంది ఫాలోయర్లున్నారు మోహన్ బాబు 6 గురిని ఫాలో అవుతున్నారు.

సినీ నటులు రాజకీయ అవతారం ఎత్తాక ట్విట్టర్ వాడకం మరింత పెరుగుతోంది జనసేనాని పవర్ స్టార్ ఎవరిని ఫాలో అవుతున్నారు? తమిళనాట నేతలుగా అవతారమెత్తిన నటుల ట్వీట్ల జోరెంత? సోషల్ మీడియాలో వారికున్న పట్టెంత?

ముందు నటన ఆపై నెమ్మదిగా రాజకీయ అరంగేట్రం చేసిన నటులు సోషల్ మీడియా వేదికగానే అడుగులు వేస్తున్నారు ఇప్పుడో ట్వీట్ అప్పుడో ట్వీట్ చేస్తూ జనంలో కాక రేపుతున్నారు. ఈ తరహా నటుల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముందు వరసలో ఉంటారు పవన్ ట్విట్టర్ ఖాతాకు23 లక్షల22 వేల487 మంది ఫాలోయర్లున్నారు అయితే పవన్ కాస్త వెరైటీ. ఆయన ఎవరినీ ఫాలో కావడం లేదు.
ఇక తమిళనాడు విషయానికొస్తే ఈమధ్యే రాజకీయ అరంగేట్రం చేసిన రజనీ కాంత్ కు సోషల్ మీడియా సపోర్ట్ బానే కనిపిస్తోంది. రజనీ బాబా కు44 లక్షల 90 వేల 273 మంది ట్విట్టర్ ఫాలోయర్లుండగా ఆయన 24 మందిని ఫాలో అవుతున్నారు.

కమల్ హాసన్ కూడా ఈమధ్యలో ట్విట్టర్ యూజర్ గా మారారు ఆయనకు 38 లక్షల98 వేల725 మంది ఫాలోయర్లున్నారు కాగా కమల్ 30 మందిని ఫాలో అవుతుంటారు సోషల్ మీడియా వినియోగంలో కమల్ కుమార్తెలు కూడా ఏం తక్కువ తినలేదు శృతి హసన్ చీటికీ మాటికీ ట్విట్టర్ లోనే ఏదో ఒక కామెంట్ చేస్తూంటుంది ఆమెకు ఆరు లక్షల మంది ట్విట్టర్ ఫాలోయర్లుండగా శృతి 423 మందిని ఫాలో అవుతోంది. కమల్ రెండో కూతురు అక్షర హాసన్ కు కూడా ట్విట్టర్ అభిమానులున్నారు ఆమెకు4 లక్షల 22 వేల 235 మంది ఫాలోయర్లుండగా ఆమె 291 మందిని ఫాలో అవుతున్నారు.

ట్విట్టర్ లో తామే టాప్ అనిపించుకుంటున్నారు అందాల భామలు కాస్త పేరొచ్చిన ప్రతీ తార తమ ఎదుగుదలకు ట్విట్టర్ నే సాధనంగా చేసుకుంటున్నారు ఓ ట్విట్టర్ ఖాతా ఓపెన్ చేసేసి ఐ వాంటు ఫాలో ఫాలో..ఫాలో.. ఫాలో యూ అంటున్నారు.

ఇక సెలబ్రిటీలలో తారల విషయానికొస్తే బాలీవుడ్ నటి దీపికా పదుకొనే సినీ తారల్లో అందరికన్నా ఎక్కువ ట్విట్టర్ ఫాలోయర్లను కలిగి ఉంది ఆమెకు 2కోట్ల 27 లక్షల 94 వేల మంది ట్విట్టర్ ఫాలోయర్లుండగా.. దీపిక మాత్రం74 మందిని ఫాలో అవుతున్నారు. బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ కు కోటీ 58 లక్షల10 వేల 632 మంది ఫాలోయర్లుండగా ఆలియాభట్ 239 మందిని ఫాలో అవుతోంది. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కొచ్చిన తమన్నా భాటియాకు 26 లక్షల 76 వేల మంది ఫాలోయర్లుండగా ఆమె 174 మందిని ఫాలో అవుతున్నారు. నాజూకు నడుము సుందరి ఇలియానా కూడా తానేం తక్కువ తినలేదనిపించుకుంది. ట్విట్టర్ ఎక్కౌంట్ లో ఆమెను24 లక్షల 14 వేలమంది ఫాలో అవుతుంటే ఇల్లీ బేబీ మాత్రం 24 మందిని ఫాలో అవుతోంది. హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగి ఇప్పుడు కాస్త తగ్గిన కాజల్ అగర్వాల్ కు ట్విట్టర్ ఖాతాలో11 లక్షల87 వేల515 మంది ఫాలోయర్లున్నారు కాగా కాజల్ 208 మందిని ఫాలో అవుతోంది.

ఇక లక్ష్మి మంచు కూడా సెలబ్రిటీయే నటిగా, నిర్మాతగా,దర్శకురాలిగా ఇప్పటికే ప్రూవ్ చేసుకున్న మంచు లక్ష్మి మోహన్ బాబు ఓన్లీ డాటర్ గానే జనాలకు గుర్తుండి పోతుంది సామాజికాంశాలపై తరచుగా స్పందించే మంచు లక్ష్మికి 12 లక్షల 88 వేల 574 మంది ట్విట్టర్ ఫాలోయర్లున్నారు. ఆమె 211 మందిని ఫాలో అవుతున్నారు. దేవ సేన గా పేరుపడిన అనూష్క శెట్టి కి 7 లక్షల ఆరువేల 959మంది ట్విట్టర్ ఫాలోయర్లున్నారు. ఆమె 32 మందిని ఫాలో అవుతున్నారు. తెలుగు సినిమాల్లో ఓ వెలుగు వెలిగి ఇప్పుడు అప్పుడప్పుడు మాత్రమే కనిపిస్తున్న ఢిల్లీ భామ శ్రియా శరణ్ ట్విటర్ ఖాతాకు 3 లక్షల96 వేల664 మంది ఫాలోయర్లున్నారు శ్రియా శరణ్ 298 మందిని ఫాలో అవుతోంది. మామగారు బిగ్ బి ట్విట్టర్ వినియోగంలో దేశంలోనే నెంబర్ 2 స్థానంలో ఉండగా ఆయన కోడలు ఐశ్వర్యా రాయ్ మాత్రం సోషల్ మీడియాలో వెరీ వెరీ పూర్ ఆమెకు కేవలం 15 వేల 441 మంది ఫాలోయర్లుండగా ఆమె 837 మందిని ఫాలో అవుతున్నారు. ఇదండీ మన సెలబ్రిటీల కిచ కిచల కమామీషూ సోషల్ మీడియాను దన్నుగా చేసుకుని కెరీర్ లోనూ, ఒపీనియన్ షేరింగ్ లోనూ దూసుకు పోతున్నారు మన నేతలు, సెలబ్రిటీలు.

Show Full Article
Print Article
Next Story
More Stories