కేన్సర్‌కి అసలు కారణం...తాజా పరిశోధనల్లో తేలిన అసలు నిజం

Submitted by arun on Wed, 07/11/2018 - 11:51

కేన్సర్‌ ఎలా వస్తుంది అంటే కాలుష్యం, గుట్కా, సిగరెట్‌, మద్యం తాగితే వస్తుందని చెబుతాం. మన శరీరంలోని జన్యువులే దీనికంతటికి కారణమని మనమందరం అనుకుంటునే ఉన్నాం. కానీ, కేన్సర్‌ రావడానికి మనిషి జన్యువులు కారణం కాదా? అంటే అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు. 

మన శరీరంలో పుట్టని ఓ జన్యువు మనలో చేరి కేన్సర్‌కు కారణం అవుతోందట. అవే.. జంపింగ్‌ జన్యువులు అని, వీటిని ‘రెట్రోట్రాన్స్‌పోసన్స్‌’గా పిలుస్తారని ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్‌ ఆడిలైడ్‌ శాస్త్రవేత్తలు తెలిపారు. ఆ జన్యువుల జన్మస్థలం.. మొక్కలు అని, అవి మొక్కలపై నుంచి ఎగిరి మనిషిపై పడటంతో ఈ ప్రాణాంతక క్యాన్సర్ వ్యాధి మనుషుల్ని నమిలేస్తోందని వెల్లడించారు. వాటిలోని ‘ఎల్‌1’ అనే ప్రొటీన్‌కు ఒక ప్రాణి నుంచి మరో ప్రాణి డీఎన్‌ఏలోకి బదిలీ చేసుకునే గుణం ఉందని వివరించారు.

విదేశీ డీఎన్‌ఏగా 15 కోట్ల ఏళ్ల కిత్రమే క్షీరదాల్లో చేరిపోయిందని పరిశోధకులు తెలిపారు. దీన్నే ‘హారిజాంటల్‌ ట్రాన్స్‌ఫర్‌’ అని అంటారని, అదే జరగకపోయి ఉంటే అసలు జన్యు ఉత్పరివర్తనలు జరిగి ఉండేవే కావన్నారు. ఎల్‌1 ప్రొటీన్‌ పూర్వీకుల నుంచి వచ్చినట్లు ఇన్నేళ్లు అనుకున్నామని, అసలు నిజం తాజా పరిశోధనల్లో తెలిసిందని వెల్లడించారు.

Tags
English Title
Causes of Cancer

MORE FROM AUTHOR

RELATED ARTICLES