వైసీపీలో చేరిన ప్రముఖ పారిశ్రామికవేత్త.. ఆ నియోజకవర్గంనుంచే పోటీ?

Submitted by nanireddy on Mon, 05/14/2018 - 10:58
businessman-joined-in-ycp

గత మూడునెలల కిందటి వరకు వైసీపీ ఎమ్మెల్యేలు ఒక్కొకరుగా అధికార టీడీపీలో చేరారు. ప్రస్తుతం ఆ పరిణామక్రమం రివర్స్  అవుతోంది. టీడీపీలోని అసంతృప్తి నేతలు వైసీపీలో చేరుతున్నారు. 20 రోజుల క్రితం కృష్ణా జిల్లా టీడీపీ కీలక నేత యలమంచిలి రవి వైసీపీలో చేరిపోయారు. అదే జిల్లానుంచి నందిగామ టీడీపీ నేత వసంత కృష్ణప్రసాద్  వైసీపీ లో చేరారు.. తాజాగా ఆదివారం జగన్ ప్రజాసంకల్ప యాత్రలో పశ్చిమ గోదావరి జిల్లా ప్రముఖ పారిశ్రామిక వేత్త గాదిరాజు సుబ్బరాజు వైసీపీలో చేరారు. ఈయన పచ్చిమగోడుగోదావరి జిల్లా భీమవరం అసెంబ్లీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. అన్ని కుదిరితే 2019 లో వైసీపీనుంచి సుబ్బరాజు బరిలోకి దిగడం ఖాయమని పార్టీ ఉన్నత వర్గాల్లో చర్చ నడుస్తోంది. 

English Title
businessman-joined-in-ycp

MORE FROM AUTHOR

RELATED ARTICLES