డీజే చప్పుడు.. నవ వధువును చంపేసింది!

Submitted by arun on Mon, 03/12/2018 - 12:33
Bride

ఒక్కోసారి ఆలోచన లేకుండా చేసే సంబరాలు.. జనాల ప్రాణం మీదికి వస్తుంటాయి. అది నిజమే అని.. ఇప్పుడు మరోసారి నిజమైంది. ఈ అనాలోచిత సంబరమే.. ఇప్పుడు ఓ పెళ్లి ఇంట్లో విషాదం మిగిల్చింది. తెలంగాణలోని సూర్యాపేటలో మొన్న రాత్రి ఓ వివాహం జరిగింది. అంతా బానే అయ్యింది. వధువు ప్రవేశం కోసం.. అమ్మాయిని తీసుకుని ఇంటికి అబ్బాయి వాళ్లు బయల్దేరారు.

దారిలో.. ఓ గుడి దగ్గర పూజలు కూడా చేశారు. ఇక్కడి వరకూ అంతా అనుకున్నట్టే జరిగింది. కానీ.. గుడి నుంచి వధువు గాయత్రి బయటికి రాగానే.. కుప్పకూలిపోయింది. ఎవరికీ అర్థం కాలేదు. ఏం జరిగిందో తెలియదు. కానీ.. చూస్తుండగానే.. గాయత్రి కన్నుమూసింది. ఇలా ఎందుకు జరిగిందని ఆరా తీస్తే.. వేడుకలో పెట్టిన డీజే శబ్దాల కారణంగానే.. గాయత్రికి గుండెపోటు వచ్చినట్టు వెలుగుచూసింది.

కేవలం హంగామా చేయడం కోసం.. పనికిరాని సంబరం కోసం ఏర్పాటు చేసిన ఆ డీజే.. ఇలా ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. పారాణి కూడా ఆరని నవ వధువును.. కానరాని లోకాలకు పంపించివేసింది. ఏం లాభం? ఆ డీజే ఉంటే ఏంటి లేకుంటే ఏంటి? అది లేకుంటే పెళ్లి పెళ్లి కాదా? ఇప్పుడు వరుడి పరిస్థితి ఏంటి? సంతోషంగా పెళ్లి చేసి పంపిద్దామనుకున్న అమ్మాయి తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి?

అంతా ఓ సారి ఆలోచించండి. ఏ వేడుక అయినా.. డీజేలతో అనవసర హంగామా అవసరమా ఆలోచించండి. వృద్ధులు, సున్నిత మనస్కులు.. ఇలాంటి వాటికి సరిపడరన్న వాస్తవాన్ని తెలుసుకోండి.

English Title
bride dies heart attack suryapet district

MORE FROM AUTHOR

RELATED ARTICLES