సోష‌ల్ మీడియాకు ఆద‌ర‌ణ క‌రువు

Submitted by lakshman on Sat, 03/10/2018 - 21:32
social media

సోష‌ల్ నెట్ వ‌ర్కింగ్ కు ఆద‌ర‌ణ రోజు రోజుకు త‌గ్గుతుంది. సోష‌ల్ నెట్ వ‌ర్కింగ్ దిగ్గ‌జఆలైన ఫెస్ బుక్, ట్విట్ట‌ర్ కు ఆద‌ర‌ణ క‌రువైపోతోంది. ఎక్కువ శాతం యువ‌త వాటికి దూరంగానే ఉంటున్నార‌ట‌. ఈ నేపథ్యంలో సోష‌ల్ మీడియాకు చాలా మంది గుడ్ బై చెబుతున్న‌ట్లు ఓ స‌ర్వే వెల్ల‌డించింది. బోస్టన్‌ కు చెందిన మార్కెట్‌ రీసెర్చ్‌ ఏజెన్సీ సంస్థ ఓరిజిన్‌ ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెయ్యి మందిపై అధ్యయనం చేసింది. 

వీరంద‌రూ 18 నుంచి 24 ఏళ్ల వ‌యసు లోపు వాళ్లే (ఇందులో భారత్‌ నుంచి 40 మంది పాల్గొన్నారు). అయితే వీరంద‌రూ కొంత కాలంగా సోషల్‌ మీడియాకు దూరంగా ఉండేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు పేర్కొంది. 50 శాతం మంది పూర్తిగా రిలాక్స్  పొందేందుకు యత్నిస్తుండగా.. 34 శాతం మంది తమ ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి యాప్‌లను ఇప్ప‌టికే తొలగించేశారు. అలాగే మొత్తం 41 శాతం మంది సోషల్‌ మీడియా ద్వారా తమ విలువైన టైమ్ ను వేస్ట్ చేసుకుంటున్నామనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఛాటింగ్‌ కంటే ఆన్‌ లైన్‌ షాపింగ్‌ కే వారు ఎక్కువ సమయం కేటాయించినట్లు చెప్పటం విశేషం. 

మొత్తమ్మీద రాను రాను సోషల్‌ మీడియాపై యూత్ కు ఇంట్రెస్ట్ తగ్గిపోతోందని.. వ్యక్తిగత విషయాలను షేర్‌ చేసుకోవటానికి కూడా ఎక్కువ ఆసక్తి చూపటం లేదని పేర్కొంది.  చివ‌ర‌కు వాటి వ‌ల్ల ఎలాంటి ఉప‌యోగం , లాభం లేద‌ని నిర్ధారణకు వస్తున్నారని..  అందుకే వాటికి దూరమౌతున్నారనంటూ... సర్వే వివరాలను ఓరిజిన్‌ సీఈవో మార్క్‌ డెన్విక్‌ వెల్లడించారు. డేటింగ్‌ యాప్‌ టిండర్‌ లాంటి వాటికి కూడా ఆదరణ తగ్గిపోతున్న క్ర‌మంలో అమెరికాలో మాత్రం స్నాప్‌ ఛాట్‌కి ఇప్పటికీ ఆదరణ తగ్గలేదని సర్వే వెల్లడించింది. 


 

English Title
boring for facebook and twitter millennials have permanently deleted accounts

MORE FROM AUTHOR

RELATED ARTICLES