ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తాం: బీజేపీ

Submitted by arun on Sat, 03/24/2018 - 12:54
somu

తెలుగుదేశం పార్టీపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఏపీకి తప్పకుండా ప్రత్యేక హోదా ఇస్తామని అందుకు కొన్ని కండిషన్స్ ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో అవినీతికి పట్టిసీమ పరాకాష్ట అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ అవినీతిని తవ్వడానికి పలుగు సరిపోదని.. ఏకంగా బుల్డోజరే కావాలని వ్యాఖ్యానించారు. పట్టిసీమలో ఒక లారీ మట్టి తీయడానికి రూ. 4 లక్షల ఖర్చా అంటూ ఆయన ఆశ్చర్యపోయారు. పట్టిసీమ ప్రాజెక్టులో తీయడానికి కేంద్రం రూ. 67 కోట్లు ఇచ్చిందన్నారు. రూ. 1120 కోట్లతో మొదలైన పట్టిసీమ రూ. 1667 కోట్లకు వెళ్లిందని వీర్రాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సుముఖంగా ఉందని, అయితే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం అది సాధ్యమయ్యే అవకాశమేలేదన్నారు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు. మట్టి నుంచి ఇసుకదాకా, పోలవరం నుంచి పట్టిసీమ దాకా లక్షల కోట్ల అవినీతి జరిగిందని, ఆఖరికి బడిపిల్లల టాయిలెట్ల కోసం ఇచ్చిన నిధులను కూడా చంద్రబాబు, ఆయన పార్టీ నేతలు ఆసాంతం నాకేశారని మండిపడ్డారు.

English Title
bjp ready give special status ap somu veerraju

MORE FROM AUTHOR

RELATED ARTICLES