దూకుడు పెంచిన బీజేపీ...తెలంగాణకు యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్‌

Submitted by arun on Fri, 09/14/2018 - 13:06

ముందస్తు ఎన్నికలు ముంచుకొస్తుండటంతో తెలంగాణ బీజేపీ దూకుడు పెంచింది. రాష్ట్రంపై దృష్టి సారించిన ఢిల్లీ పెద్దలు తెలంగాణలో పర్యటించి ఎన్నికల వ్యూహంపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా రెండుసార్లు తెలంగాణలో పర్యటించి భారీ బహిరంగ నిర్వహించేందుకు అంగీకరించడంతో పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్ వచ్చింది. 

ముంద‌స్తు ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ బీజేపీ జోరుపెంచుతోంది. ఇందులో భాగంగా శంఖారావ సభ కోసం భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తోంది బీజేపీ పార్టీ. అన్ని పార్టీల‌తో పోటి ప‌డేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు కమల నాధులు అధిష్టాన పెద్దలతో బహిరంగ సభలు ఏర్పాటు చేసి ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు పావులు కదుపుతుంది.

ఈ నెల 15వ తేదీన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఎన్నికలపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఆఫీస్ బేరర్స్, జిల్లా ఇన్ఛార్జీలు, అధ్యక్షులతో సమావేశమై, సూచనలు ఇవ్వనున్నారు. అనంతరం మధ్యాహ్నం మహబూబ్ నగర్ లో ఏర్పాటు చేయనున్న బహిరంగసభలో పాల్గొంటారు. దీనికి తోడు 29న కరీంనగర్ లో నిర్వహించే బహిరంగసభలో కూడా ఆయన పాల్గొంటారు. రానున్న ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ముందుకు సాగే విధంగా పార్టీ శ్రేణులను ఆయన సమాయత్తం చేయనున్నారు.

ఇక భారత ప్రధాని నరేంద్రమోడీ కూడా తెలంగాణలో బహిరంగ సభలో పాల్గొనేందుకు ప్లాన్ వేస్తున్నారు పార్టీ పెద్దలతో రాష్ట్రానికి రానుండటంతో రాష్ట్ర నాయకులు, కార్యకర్తల్లో కొత్త జోష్ వస్తోంది ఇక యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్‌ కూడా రాష్ట్రానికి రానున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ముందస్తు ఎన్నికల నేపథ్యంలో బీజేపీ దూసుకు పోయేందుకు పక్క స్కెచ్ సిద్ధం చేసుకుంది. 

English Title
BJP President Amit Shah to Visit Telangana on September 15

MORE FROM AUTHOR

RELATED ARTICLES