ముందస్తుకు సిద్ధమైన మరో రాష్ట్రం

Submitted by nanireddy on Wed, 09/05/2018 - 19:49
bjd-urges-eci-to-conduct-simultaneous-lok-sabha-and-assembly-elections-in-odisha

తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని అధికార తెరాస ప్రయత్నాలు ప్రారంభించగా ..తమ రాష్ట్రం కూడా ముందస్తు ఎన్నికలకు సిద్ధమని ప్రకటించింది బీజేడీ. 2019లో నిర్వహించవలసిన లోక్‌సభ ఎన్నికలను కేంద్ర ప్రభుత్వం ముందుకు జరిపేందుకు నిర్ణయం తీసుకుంటే, ఆ ఎన్నికలతోపాటే ఒడిశా శాసనసభ ఎన్నికలను కూడా ఒకేసారి నిర్వహించాలని బీజేడీ నేత, ఎంపీ పినాకి మిశ్రా బుధవారం భారత చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌ (సీఈసీ) ఓ పీ రావత్‌ ను కలిసి కోరారు. ఎంపీ . తమ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా లోక్‌సభ ఎన్నికలతో పాటు తమ రాష్ట్ర శాసన సభకు కూడా ఎన్నికలు నిర్వహించాలని తద్వారా తమ రాష్ట్రానికి అదనపు భారంగా వెయ్యి కోట్ల ఖర్చు మిగులుతుందని సీఈసీకి నివేదించారు. 

English Title
bjd-urges-eci-to-conduct-simultaneous-lok-sabha-and-assembly-elections-in-odisha

MORE FROM AUTHOR

RELATED ARTICLES