బిగ్ బాస్ ఎలిమినేషన్ లీక్ వీరులు వీరే!

బిగ్ బాస్ ఎలిమినేషన్ లీక్ వీరులు వీరే!
x
Highlights

తెలుగు బుల్లితెర ప్రేక్షకులను అమితంగా అలరిస్తున్న బిగ్ బాస్ షోలో ప్రతి వారం హౌస్ నుంచి ఒకరు ఎలిమినేట్ అవుతారన్న సంగతి అంద‌రికి తెలిసిందే. ఎలిమినేట్...

తెలుగు బుల్లితెర ప్రేక్షకులను అమితంగా అలరిస్తున్న బిగ్ బాస్ షోలో ప్రతి వారం హౌస్ నుంచి ఒకరు ఎలిమినేట్ అవుతారన్న సంగతి అంద‌రికి తెలిసిందే. ఎలిమినేట్ అయ్యేది ఎవరన్న విషయం ఆదివారం రాత్రి మాత్రమే అంద‌రికి తెలుస్తుంటుంది. కానీ, శనివారం సాయంత్రమే మరుసటి రోజు బయటకు వెళ్లబోయేది ఎవరన్న విషయం బయటకు పొక్కుతోంది. ఎందుకంటే ఈ షో ఒక రోజు ముందుగానే షూట్ చేసి మ‌రుస‌టి రోజు ప్ర‌సారం చేస్తారు. అంటే ఆదివారం ప్ర‌సారం అయ్యే షో శ‌నివారం షూట్‌ను పూర్తి చేస్తార‌న్న‌మాట‌. దీంతో సస్పెన్స్ లేకుండా పోతుందని బిగ్ బాస్ నిర్వాహ‌కులు వాపోతున్నారు. సీజన్ వన్ లో లేని లీకుల బాధ సీజన్ టూలో ఎందుకు వచ్చిందన్న విషయాన్ని నిర్వాహ‌కులు గుర్తించారు.

మొదటి వారంలో కామన్ మ్యాన్ కోటాలో వచ్చిన వారు ఎలిమినేట్ కాబోతున్నారంటూ వచ్చిన లీక్, నిన్నటి నందిని ఎలిమినేషన్ వరకూ కొనసాగింది. మధ్యలో పూజా రామచంద్రన్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ, నూతన్ నాయుడు, శ్యామల వైల్డ్ కార్డ్స్, కమల్ హాసన్ స్పెషల్ గెస్ట్ అప్పియరెన్స్ వంటి వన్నీ ఒకరోజు ముందే బయటకు వచ్చాయి. వాస్తవానికి సీజన్ వన్ ను పుణెకు 100 కిలోమీటర్ల దూరంలోని లోనావాలా అడవుల్లో ప్రత్యేక సెట్ వేసి షూట్ చేశారు. పోటీదారులను విమానాల్లో తీసుకెళ్లి తీసుకొచ్చారు. ఎలిమినేట్ అయిన వారు తెలుగు వారికి కనిపించాలంటే 24 గంటలు పట్టేది. దీనికితోడు అప్పటి షోకు కెమెరామెన్ లు, ఎడిటర్లు, టెక్నాలజీ నిపుణులు, హౌస్ క్లీనర్లు, మేకప్ సభ్యులు అంతా తెలుగు తెలియని వారే. అందువల్లే ఎవరు ఎప్పుడు ఎలిమినేట్ అవుతున్నారన్న విషయం బయటకు రాకుండా సస్పెన్స్ మెయిన్ టెయిన్ అయింది.

ఇక సీజన్ 2 విషయానికి వస్తే, అన్నపూర్ణ స్టూడియోలో సెట్ వేయడమే బిగ్ బాస్ చేసిన తప్పయిపోయింది. తెలుగు తెలిసిన కెమెరామెన్లు, సిబ్బంది, పనివాళ్లు ఉండటం, వారికి పోటీదారుల గురించి పూర్తి అవగాహన ఉండటం, మరుసటి రోజు ప్రసారమయ్యే కార్యక్రమాన్ని ఒకరోజు ముందుగా షూట్ చేస్తుండటం ఈ లీక్ లకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. దీన్ని గుర్తించిన బిగ్ బాస్ సైతం ఏమీ చేయలేకపోతున్నాడని, అయితే, లీక్ లను నిరోధించే ప్రయత్నాలు మాత్రం జరుగుతున్నాయని సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories