తెలుగు నెక్స్ట్ బిగ్ బాస్ హోస్ట్ ఆ హీరోనేనా.?

Submitted by nanireddy on Tue, 10/02/2018 - 16:24
biggboss3-host-maybe-vijay-devarakonda

మొదట పరభాషలో ప్రారంభమైన బిగ్ బాస్ క్రమంగా అన్ని భాషల్లో ప్రసారమవుతోంది. ఇక తెలుగులో అయితే ఇప్పటికే రెండు సీజన్ లు కంప్లీట చేసుకుంది. రెండింటిలోను టాప్ రేటింగ్స్ ను సంపాదించింది. మొదటి బిగ్ బాస్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రాతినిధ్యం వహించారు. దాంతో సాధారణంగానే ఆ షోకు హైప్ క్రియేట్ అయింది. 2017 మొదటి బిగ్ బాస్ లో.. హీరో శివబాలాజీ విజేతగా నిలిచాడు. ఆ తరువాత 2018 బిగ్ బాస్ ప్రారంభమై.. ఇటీవల ముగిసింది. దీనికి నాచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించాడు. మొదట్లో కాస్త మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న బిగ్ బాస్ 2 క్రమంగా పుంజుకుంది. 20 రోజుల  తరువాత నుంచి ఈ షో టాప్ రేటింగ్ లో దూసుకుపోయింది. ఇందులో మొదటి నుంచి అందరూ ఊహించినట్టు కౌశల్ విజేతగా నిలిచాడు. ఇదిలావుంటే 2019 లో మొదలవుతుందో తెలియని మూడో బిగ్ బాస్ కు అప్పుడే హోస్ట్ ను నిర్ణయిస్తున్నారు అభిమానులు. మూడో బిగ్ బాస్ కు  యువహీరో విజయ్ దేవరకొండ హోస్ట్ గా వ్యవహరిస్తారని సామజిక మాధ్యమాల్లో చర్చించుకుంటున్నారు. దానికి కారణం ఇటీవల విజయ్ దేవరకొండకు ఏర్పడిన క్రేజేనట. వరుస హిట్ లతో దూసుకుపోతున్న విజయ్ కచ్చితంగా  నెక్స్ట్ బిగ్ బాస్ కు ప్రాతినిధ్యం వహిస్తాడని అనుకుంటున్నారు. ఇంతకీ ఇది నిజమో కాదో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాలసిందే. 

English Title
biggboss3-host-maybe-vijay-devarakonda

MORE FROM AUTHOR

RELATED ARTICLES