బిగ్ బాస్ గ్రాండ్‌ ఫినాలే.. చీఫ్ గెస్ట్ గా ఆ అగ్రహీరో..

Submitted by nanireddy on Sun, 09/30/2018 - 16:53
Bigg Boss Telugu 2 finale

బిగ్ బాస్ గ్రాండ్‌ ఫినాలే.. ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. ఎక్కడ విన్నా దీని గురించే చర్చ జరుగుతోంది. ఇవాళ్టితో బిగ్ బాస్ సీజన్ 2 ముగుస్తుండటంతో విజేత ఎవరు అనే ఉత్కంఠతో బుల్లితెర ప్రేక్షకులు ఎదురు చేస్తున్నారు. ఈరోజు జరిగే గ్రాండ్ ఫినాలేలో కౌశల్, గీతా మాధురి, దీప్తి నల్లమోతు, తనీష్, సామ్రాట్‌లు ఉండటంతో ఫైనల్ వార్ ఆసక్తిగా మారింది. వీరిలో అంతిమ విజేత ఎవరన్నదానిపై ఇపుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది.

షో ప్రారంభం నుంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ పెంచుకుంటున్న కౌషల్‌కే విజయావకాశాలు ఎక్కువున్నాయని సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది. ఈసారి విజేత గీతామాధురేనని గత సీజన్‌ పార్టిసిపెంట్‌, సినీనటి అర్చన అంచనా వేస్తోంది. మొత్తం మీద మరికొన్ని గంటల్లో అంతిమ విజేత ఎవరో తేలిపోనుంది. ముగింపు కార్యక్రమానికి విక్టరీ వెంకటేష్‌ చీఫ్‌ గెస్ట్‌గా వస్తారన్న ఓ వార్త వైరల్ గా మారింది.
 

English Title
Bigg Boss Telugu 2 finale

MORE FROM AUTHOR

RELATED ARTICLES