బిగ్ బాస్ 2 విజేతగా కౌశల్.. ప్రకటించిన విక్టరీ వెంకటేష్

Submitted by nanireddy on Mon, 10/01/2018 - 07:24
bigg-boss-2-telugu-tittle-winner-koushal

బిగ్‌ బాస్ 2 ఫైనల్స్ భారత్ – పాక్ మ్యాచ్‌ను తలపించింది. ఐదుగురు కంటెస్టెంట్లు మిగలడంతో. ఫైనల్లో విజేతగా ఎవరు నిలుస్తారోనని టెన్షన్ నెలకొంది. కౌశల్, దీప్తి, గీతామాధురి, సామ్రాట్, తనీష్ ఫైనల్‌కు చేరారు. కానీ విన్నర్ ఒకరే. ఆ ఒక్కరు ఎవరు? అందరిలో ఒకటే టెన్షన్‌. బిగ్ బాస్ విన్నర్‌గా ఎవరని ప్రకటిస్తారా అని ఆతృతగా ఎదురు చూస్తున్న ప్రేక్షకుల ముందుకు ఫైనలిస్టులు గీత, కౌశల్.. ఈ ఇద్దరినీ నాని స్వయంగా స్టేజి మీదకు తీసుకువచ్చారు. అయితే ఈ షోకి గెస్ట్‌గా వచ్చిన విక్టరీ వెంకటేష్ విజేతను ప్రకటించారు. అందరూ ఊహించినట్టుగానే బిగ్ బాస్ టైటిల్‌ను కౌశల్ మందాకు ప్రకటించారు విక్టరీ వెంకటేష్. దీంతో గీతా మాధురి రన్నరప్‌గా నిలిచింది. ఏదైనా జరగొచ్చు.. ఇంకాస్త మసాలా.. అదిరిపోయే డాన్స్‌లు.. ఆకట్టుకునే పెర్ఫామెన్స్.. బిగ్ బాస్ స్టేజ్‌‌ని షేక్ చేస్తున్న దీప్తి సునయన కిరాక్ పెర్ఫామెన్స్.. తేజస్విని, భాను శ్రీ, నందినిల హాట్ షో.. నేచురల్ స్టార్ స్టన్నింగ్ పెర్ఫామెన్స్.. కావాల్సినంత ఎంటర్టైన్మెంట్.. ఊహించని ట్విస్ట్‌.. ఇదీ బిగ్ బాస్ సీజన్ 2 ప్రత్యేకత. 

English Title
bigg-boss-2-telugu-tittle-winner-koushal

MORE FROM AUTHOR

RELATED ARTICLES