టీఆర్‌ఎస్‌కు భారీ షాక్...కాంగ్రెస్‌లో చేరబోతున్న...

Submitted by arun on Sun, 11/04/2018 - 13:31

సూర్యాపేట జిల్లాలో టీఆర్‌ఎస్‌కు భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ నేతలు,కార్యకర్తలు పెద్ద ఎత్తున కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధమైంది. హుజూర్‌నగర్ టీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. మేళ్లచెరువు, చింతలపాలెం, మఠంపల్లి మండలాల టీఆర్ఎస్ అధ్యక్షులు, మరో 100మంది నేతలు కాంగ్రెస్‌లో చేరేందుకు హైదరాబాద్‌ బయల్దేరినట్టు తెలుస్తోంది. వీరంతా పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కలిసి పార్టీలో చేరబోతున్నారు. గత కొద్ది రోజులుగా హుజూర్‌నగర్ టీఆర్ఎస్ పార్టీని అధిష్టానం పట్టించుకోకపోవడమేగాక ఇప్పటికీ టీఆర్ఎస్ అభ్యర్థిని ఎంపిక చేయలేదు. దీంతో స్థానిక నేతల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. దీంతో టీఆర్ఎస్ అధిష్టానం తీరును నిరసిస్తూ ఆ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్టు తెలుస్తోంది. 

English Title
BIG Shock To TRS Party In Suryapet District

MORE FROM AUTHOR

RELATED ARTICLES