కేజ్రీవాల్ సర్కార్‌కు బిగ్ షాక్

కేజ్రీవాల్ సర్కార్‌కు బిగ్ షాక్
x
Highlights

ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్‌కు బిగ్ షాక్ తగిలింది. 20 మంది ఆప్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కేంద్ర ఎన్నికల సంఘం చేసిన సిఫారసుకు.. రాష్ట్రపతి...

ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్‌కు బిగ్ షాక్ తగిలింది. 20 మంది ఆప్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కేంద్ర ఎన్నికల సంఘం చేసిన సిఫారసుకు.. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు. 20 మంది ఆప్ ఎమ్మెల్యేల అనర్హతపై.. రాష్ట్రపతి భవన్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. పార్లమెంటరీ సెక్రటరీలుగా.. లాభదాయక పదవులు అనుభవించిన 20 మంది ఆప్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని.. 2 రోజుల కిందట కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రపతికి సిఫారసు చేసింది. దీనికి.. కోవింద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రెసిడెంట్ డెసిషన్‌.. కేజ్రీవాల్ సర్కార్‌ను ఒక్క కుదుపు కుదిపేసింది.

తాజా పరిణామంతో.. ఢిల్లీలో పొలిటికల్‌ ఈక్వేషన్స్ కూడా మారిపోయాయి. మొత్తం 70 సీట్లున్న ఢిల్లీ అసెంబ్లీలో.. 65 మంది ఎమ్మెల్యేలుగా ఉన్న ఆప్ బలం.. రాష్ట్రపతి డెసిషన్‌తో 45కు తగ్గింది. త్వరలోనే.. 20 అసెంబ్లీ స్థానాలకు బైపోల్స్ నిర్వహించాల్సి ఉంటుంది. అనర్హత వేటు పడిన వారిలో మినిస్టర్ కైలాష్‌ గెహ్లాట్‌ కూడా ఉన్నారు.

మొత్తం 21 మంది ఆప్ ఎమ్మెల్యేలు 2015 మార్చి 13 నుంచి.. సెప్టెంబరు 8, 2016 వరకు పార్లమెంటరీ కార్యదర్శులుగా పదవులు అనుభవించారు. దీని ద్వారా.. లాభదాయక పదవులను చేపట్టినట్లయిందని ఫలితంగా ఎమ్మెల్యేలు అనర్హులవుతారని రాష్ట్రపతి కోవింద్‌కు ఈసీ ప్రతిపాదన పంపించింది. 21 మంది ఎమ్మెల్యేలలో ఒకరు ఇటీవల తన పదవికి రాజీనామా చేశారు.

ఈసీ సిఫారసును వ్యతిరేకిస్తూ ఆప్‌ ఎమ్మెల్యేలు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. వారి పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. ఈసీ నిర్ణయాన్ని ఆప్‌ తీవ్రంగా తప్పుబట్టింది. ఇది రాజ్యాంగ విరుద్ధమని ఆరోపించింది. కానీ.. రాష్ట్రపతి మాత్రం ఈసీ సిఫారసుకు ఆమోదం తెలపడంతో.. ఢిల్లీలో పొలిటికల్ ఈక్వేషన్స్ మారిపోయాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories