పౌరహక్కుల నేతల గృహనిర్భందం పొడిగింపు

పౌరహక్కుల నేతల గృహనిర్భందం పొడిగింపు
x
Highlights

భీమా కొరేగావ్ హింస కేసును దర్యాప్తు కొనసాగించడానికి పుణె పోలీసులకు సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. పౌర హక్కుల నేతలు వరవర రావు, వెర్నన్ గొనె సాల్వేన్,...

భీమా కొరేగావ్ హింస కేసును దర్యాప్తు కొనసాగించడానికి పుణె పోలీసులకు సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. పౌర హక్కుల నేతలు వరవర రావు, వెర్నన్ గొనె సాల్వేన్, సుధా భరద్వాజ్, అరుణ్ ఫెరీరా, గౌతమ్ నవ్‌లఖా అరెస్టు విషయంలో జోక్యం చేసుకోవడానికి అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. పౌరహక్కుల సంఘం నేతల అరెస్టు కేసును విచారించిన అత్యున్నత న్యాయస్థానం.. సిట్ దర్యాప్తు జరిపించాలన్న పిటిషనర్ల డిమాండ్‌ను తోసిపుచ్చింది. పుణె పోలీసులు దర్యాప్తు కొనసాగించాలని కోర్టు స్పష్టం చేసింది.

పౌరహక్కుల నేతల అరెస్టుకు రాజకీయ అభిప్రాయాలపై విభేదాలు కారణం కాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అరెస్టులకు దురుద్దేశాలు ఆపాదించలేమని చెప్పింది. వరవరరావుతో సహా మరో ఐదుగురు పౌర హక్కుల నేతల గృహ నిర్బంధాన్ని మరో నాలుగు వారాలు పొడిగిస్తూ తీర్పుచెప్పింది. అరెస్టయిన నేతలు ఉపశమనం కోసం విచారణ కోర్టుకు వెళ్లవచ్చని కూడా తెలిపింది. మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై గత నెల 28న విరసం నేత వరవరరావు సహా ఐదుగురిని పుణె పోలీసులు అరెస్ట్ చేయగా వారంతా సుప్రీంను ఆశ్రయించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories