హెచ్చరిక : పిన్ నంబర్ ఎంటర్ చేయకుండానే నగదు ట్రాన్స్ ఫర్

హెచ్చరిక : పిన్ నంబర్ ఎంటర్ చేయకుండానే నగదు ట్రాన్స్ ఫర్
x
Highlights

సైబర్ దాడులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ హ్యాకింగ్, డెబిట్, క్రెడిట్ మోసాలకు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు. ప్రస్తుతం వీటికి తోడు స్వైపింగ్ మోసాలు...

సైబర్ దాడులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ హ్యాకింగ్, డెబిట్, క్రెడిట్ మోసాలకు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు. ప్రస్తుతం వీటికి తోడు స్వైపింగ్ మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. కార్డు స్వైప్ చేస్తేగాని ట్రాన్స్ ఫర్ అవని నగదు.. ఇప్పుడు ఆలా చేయకుండానే ట్రాన్స్ ఫర్ అవుతున్నాయి.. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అందులో ఓ వ్యక్తి తన పని తాను చేసుకుంటూ పరిసరాలను గమనించకుండా ఉన్నాడు. ఇంతలో మరో వ్యక్తి కార్డు స్వైపింగ్ మెషిన్ ను ఆ వ్యక్తి జేబు దగ్గర పెట్టాడు. దాంతో సెన్సార్ ద్వారా పిన్ నంబర్ ఎంటర్ చేయకుండానే నగదు ట్రాన్స్ ఫర్ అవ్వడంతో పాటు రుజువు స్లిప్ రావడం విస్మయానికి గురిచేస్తోంది.సాధారణంగా సెన్సార్ సంబంధిత స్వైపింగ్ మెషిన్లు మనకు అందుబాటులో ఉన్నాయి. కానీ జేబులో ఉండీ.. అదికూడా ఎటువంటి పిన్( పర్సనల్ ఐడెంటిఫికేషన్ నెంబర్) ఎంటర్ చేయకుండానే ఇలా నగదు ట్రాన్స్ ఫర్ అవ్వడంపై జాగ్రత్త వహించాలంటున్నాడు ఆ వ్యక్తి.

Show Full Article
Print Article
Next Story
More Stories