అడ్డంగా బుక్కైన ప్రీతి అగ‌ర్వాల్

అడ్డంగా బుక్కైన ప్రీతి అగ‌ర్వాల్
x
Highlights

ఢిల్లీ బ‌వానా ఇండ‌స్ట్రీలో ప్రాంతంలో ఘోర అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో 17మంది దుర్మ‌ర‌ణం పాల‌య్యారు. స‌మాచారం అందుకున్న అగ్నిమాప‌క సిబ్బంది...

ఢిల్లీ బ‌వానా ఇండ‌స్ట్రీలో ప్రాంతంలో ఘోర అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో 17మంది దుర్మ‌ర‌ణం పాల‌య్యారు. స‌మాచారం అందుకున్న అగ్నిమాప‌క సిబ్బంది మంట‌లు ఆర్పే ప్ర‌య‌త్నం చేసింది. అయితే భారీగా మంట‌లు ఎగిసిప‌డ‌డంతో మూడు అంత‌స్థుల‌కు తాకిన‌ట్లు తెలుస్లోంది. ఈ మంట‌లు వ్యాపించ‌డంతో తొలి అంతస్తులో ఉన్న‌ 13 మంది, కింది అంతస్తులో నలుగురు మృతి చెందారు. మృతి చెందిన 17 మందిలో పదిమంది మహిళలు ఉన్నారు. గాయపడిన బాధితుల్ని స్థానిక ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.
ఈ సంఘ‌ట‌నలో పోలీసులు మ‌నోజ్ జైన్ తో పాటు మ‌రికొంత‌మందిని అదుపులోకి తీసుకున్న‌ట్లు డీసీపీ (రోహిణి) రజ్‌నీష్ గుప్తా తెలిపారు.
ప్ర‌మాదంపై పీఎం మోడీ, ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ దిగ్భ్రాంతికి గుర‌య్యారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వైద్యశాఖ మంత్రి జేపీ నడ్డా మాట్లాడుతూ క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేందుకు ఎయిమ్స్, సఫ్దర్‌జంగ్ ఆసుపత్రులను సిద్ధం చేసినట్టు చెప్పారు. ప్రమాదంపై విచారణకు ఆదేశించినట్టు ఢిల్లీ పట్టణాభివృద్ధి శాఖా మంత్రి సత్యేందర్ జైన్ తెలిపారు.

మ‌రోవైపు ఈ ప్ర‌మాదాన్నిబీజేపీ లైట్ తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. స్థానిక బీజేపీ నేత‌, నార్త్ ఢిల్లీ మేయర్ ప్రీతి అగర్వాల్ ఈ ప్ర‌మాదం జ‌రిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. అనంత‌రం ప్ర‌మాదం గురించి మీడియాతో మాట్లాడే స‌మ‌యంలో త‌న అధికారుల‌తో ఫ్యాక్ట‌రీ ప్ర‌మాదం గురించి సీక్రెట్ గా చ‌ర్చించుకున్నారు. . ఈ ఫ్యాక్టరీ లైసెన్స్ మన దగ్గరే ఉంది.. దీనిపై మనం ఏమీ మాట్లాడొద్దు అని ఆమె చెప్పారు.ఆమె సీక్రెట్ గా చెప్పిన మాట‌లు మైకులో స్పష్టంగా వినిపించాయి. .దీనిని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ రీట్వీట్ చేశారు.
ఈ రీట్వీట్ పై స్పందించిన ఢిల్లీ బీజేపీ చీఫ్ మ‌నోజ్ తివారి అసలు ఆ వీడియోలో ఈ ఫ్యాక్టరీ అన్న పదం మాత్రమే స్పష్టంగా వినిపించిందని, అలాంటి వీడియోను పట్టుకొని బీజేపీని నిందించడం సరికాదని సూచించారు.
అయితే ఆ ఫ్యాక్ట‌రీ లైసెన్స్ ఎలా వ‌చ్చిందో తెలుసుకొని అనంత‌రం నిందితుల‌కు క‌ఠిన శిక్ష‌లు విధిస్తామ‌ని ఢిల్లీ అర్బ‌న్ డెవ‌ల‌ప్ మెంట్ మంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత సత్యేంద్ర జైన్ హెచ్చ‌రించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories