బతుకమ్మ చీరెలు రెడీ...అక్టోబర్ 12 నుంచి బతుకమ్మ చీరలను పంపిణీ

బతుకమ్మ చీరెలు రెడీ...అక్టోబర్ 12 నుంచి బతుకమ్మ చీరలను పంపిణీ
x
Highlights

బతుకమ్మ ఉత్సవాలకు తెలంగాణ ముస్తాబవుతోంది. ఈ ఏడాది పండుగను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. బతుకమ్మ పండుగ సందర్భంగా ఈసారి కూడా...

బతుకమ్మ ఉత్సవాలకు తెలంగాణ ముస్తాబవుతోంది. ఈ ఏడాది పండుగను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. బతుకమ్మ పండుగ సందర్భంగా ఈసారి కూడా రాష్ట్రంలో మహిళలకు చీరలు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ పంపిణీకి సంబంధించిన ఏర్పాట్లపై మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. అక్టోబర్ 12 నుంచి బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తామని ప్రకటించారు.

గతంలో బతుకమ్మ చీరల పై జరిగి వివాదాలను చెక్ పెట్టే విధంగా తెలంగాణ ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టింది. ఈసారి పూర్తిగా సిరిసిల్లా మరమగ్గాలపైనే తయారు చేయ్యింది. 80 రకాల ఝరీ అంచు చీరలు మహిళకు బతుకమ్మ పండుగకు అందించనుంది. ఇందు కోసం రాష్ట్ర ప్రభుత్వం 2 లకోట్ల 80 లక్షలను ఖర్చు చేసింది.

హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లోని పురపాలక శాఖ కమిషనర్ కార్యాలయంలో బతుకమ్మ చీరలను కేటీఆర్ పరిశీలించారు. ఈ ఏడాది 95 లక్షల చీరలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఇప్పటికే జిల్లాలకు 49 లక్షల చీరలు పంపిణీ చేశామన్నారు. 80 రకాలైన రంగులలో జరీ అంచుతో చీరలను తయారు చేసినట్లు మంత్రి వివరించారు.

మాసబ్‌ట్యాంక్‌లోని పురపాలక శాఖ కమిషనర్ కార్యాలయంలో బతుకమ్మ చీరలను ప్రదర్శనకు ఉంచారు. బతుక్మచీరల నాణ్యతపై మహిళల అభిప్రాయలను తీసుకున్నారు. బతుకమ్మ చీరల టెండర్ ద్వారా తన బతుకులు ఎంతో బాగుపడినట్లు మరమగ్గాల కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తూన్నారు. పవర్ లూమ్ కస్టర్ లో 16 వేల నేత పనివారికి దాని అనుబంద కార్మికలకు ఉపాది దొరికిందని అంటున్నారు. నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ లేకుండా తయారు చేయించిన ఈ చీరలు గత ఏడాది కంటే ఎంతో మెరుగ్గా ఉన్నాయి. ఒక్కో చీర ఖరీదు దాదాపు 300 రూపాయలు ఉన్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories