కాళ్లు మొక్కిన నిరుపేదకు.. సాయమందించిన బాలయ్య

Submitted by arun on Fri, 10/05/2018 - 14:53
balakrishna

ఎన్టీఆర్ బయోపిక్ సినిమా షూటింగ్ కృష్ణా జిల్లా హంసల దీవి పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. షూటింగ్‌లో బిజీగా వున్న బాలయ్య దగ్గరికి ఓ నిరుపేద వ్యక్తి వచ్చి కాళ్ళు పట్టుకున్నాడు. అతను అంత నిస్సహాయంగా ఎందుకు ఏడుస్తూ తన కాళ్ళు పట్టుకున్నాడో అడిగి తెలుసుకున్నాడు బాలయ్య. అతనికి క్యాన్సర్ వ్యాధి వుందని, జబ్బు నయం చేయించుకోవడానికి తనవద్ద డబ్బులేదని, మీరే ఆదుకోవాలని చెప్పాడతడు. ఆయన పరిస్థితి చూసి చలించిపోయిన బాలయ్య అప్పటికప్పుడే బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి ఫోన్ చేశారు. ఉచితంగా మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. బాలయ్య చేసిన సాయానికి ఆ వృద్ధుడు సంతోషంతో కంటతడి పెట్టాడు. కాళ్లకు మొక్కి కృతజ్ఞతలు తెలియజేశాడు. ఈ ఘటనకు సంబంధించి ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

English Title
balakrishna help for old man

MORE FROM AUTHOR

RELATED ARTICLES