ధర్మాబాద్‌ కోర్టులో చంద్రబాబుకు ఊరట

Submitted by arun on Fri, 10/12/2018 - 13:56
babu

ధర్మాబాద్ కోర్టులో ఏపీ సీఎం చంద్రబాబుకు ఊరట లభించింది. బాబ్లీ కేసులో చంద్రబాబుకు జారీ చేసిన.. నాన్ బెయిలబుల్ వారెంటును కోర్టు రద్దు చేసింది. తదుపరి విచారణను ఈ నెల 15కు వాయిదా వేసింది. బాబ్లీపై పోరాటం కేసులో సీఎం చంద్రబాబుపై జారీచేసిన నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ను రద్దు చేయాలంటూ న్యాయవాదులు వేసిన రీకాల్‌ పిటిషన్‌‌పై కోర్టులో నేడు వాదనలు జరిగాయి. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాదులు సిద్దార్థ లూత్రా, సుబ్బారావు వాదనలు వినిపించారు. తమ క్లయింట్ సీఎం కావడంతో వ్యక్తిగత హాజరు సాధ్యం కాదని, నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీ చేయలేదని న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. గంటన్నర పాటు సాగిన వాదనల అనంతరం.. ఈ నెల 15వ తేదీన వ్యక్తిగత హాజరు నుంచి సీఎం చంద్రబాబుకు మినహాయింపు ఇస్తున్నట్లు ధర్మాబాద్ కోర్టు తీర్పునిచ్చింది. అయితే నవంబర్ 3వ తేదీన హాజరు కావాలని కోర్టు సూచించగా.. కేసు పూర్తి అయ్యే వరకు మినహాయింపు ఇవ్వాలని న్యాయవాదులు కోరినట్లు తెలుస్తోంది.

English Title
babli-case-arguments-over-on-recall-petition

MORE FROM AUTHOR

RELATED ARTICLES