ఇక సెలవంటూ సేదతీరిన కర్మయోగి

ఇక సెలవంటూ సేదతీరిన కర్మయోగి
x
Highlights

భారత రత్న, మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి శకం ముగిసింది.ప్రియాతి ప్రియమైన బీజేపీ నేతలు, అభిమాన శ్రేణుల తుది నివాళుల మధ్య అటల్‌జీ అంతిమసంస్కారాలు...

భారత రత్న, మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి శకం ముగిసింది.ప్రియాతి ప్రియమైన బీజేపీ నేతలు, అభిమాన శ్రేణుల తుది నివాళుల మధ్య అటల్‌జీ అంతిమసంస్కారాలు ముగిశాయి. బీజేపీ కేంద్ర కార్యాలయం నుంచి బయలుదేరిన వాజపేయి అంతిమ యాత్ర.. అశేష జనవాహిని మధ్య స్మృతి స్థల్‌కు చేరుకుంది. త్రివిద దళాధిపతులు మాజీ ప్రధాని వాజ్‌పేయికి నివాళులు అర్పించారు. కేంద్ర మంత్రులు, లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ తదితరులు బహుముఖ ప్రజ్ఞాశాలి వాజ్‌పేయికి తుది వీడ్కోలు పలికారు. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, పలు రాష్ట్రాల ముఖ్య మంత్రులు వాజ్‌పేయికి కడసారి నివాళులర్పించారు. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాలు కాలి నడకన వాజ్‌పేయి అంతిమయాత్రలో పాల్గొన్నారు. యమునా నది ఒడ్డున ఏర్పాటు చేసిన స్మృతి స్థల్ లో మహానేత అంత్యక్రియలు పూర్తయ్యాయి. అయన చితికి దత్తపుత్రిక నిప్పటించారు. తాత అటల్‌జీ నుంచి ఎప్పుడూ బహుతులను అందుకునే ఆయన మనవరాలు నిహారిక తాత భౌతిక కాయాన్ని చూసి తీవ్రంగా రోదించింది. ఆమెను చూసి పలువురు కన్నీటిపర్యంతమయ్యారు.

Show Full Article
Print Article
Next Story
More Stories