ఆపిల్ సంస్థను భయపెడుతున్న తెలుగు అక్షరం..

Submitted by arun on Sat, 02/17/2018 - 13:12
Apple

అనేక బిలియన్ డాలర్ల టెక్ దిగ్గజం ఆపిల్‌.. తేటతీయని తెలుగు భాషంటేనే ఉలిక్కి పడుతోంది. ఓ తెలుగు అక్షరాన్ని చూస్తే తెగ భయపడుతోంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న యాపిల్ ఉత్పత్తులను ఒకేఒక్క తెలుగు అక్షరం తిప్పలు పెడుతోంది. యాపిల్ సంస్థకు చుక్కలు చూపిస్తోంది. ఆ సంస్థకు చెందిన ఐఫోన్ యూజర్లను 'జ్ఞా' అక్షరం కలవరపెడుతోంది. ఆపిల్ ఆపరేటింగ్ సిస్టమ్‌ IOSకు చెందిన కొన్ని వెర్షన్లలో తలెత్తిన బగ్ కారణంగా ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్ లాంటి ఆపిల్ డివైజ్‌లు క్రాష్ అవుతున్నాయి. 

మధురమైన తెలుగు భాషలోని ‘జ్ఞా’ అనేక అక్షరం ఐఫోన్ యూజర్లను కలవరపెడుతోంది. ప్రపంచంలోని యాపిల్ ఐఫోన్లను నిలువునా క్రాష్ చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే చర్చ. ఐఓఎస్ 11.2.5 వెర్షన్‌లో పనిచేస్తున్న ఐఫోన్లు ఆ అక్షరం కారణంగా సాంకేతిక సమస్య ఏర్పడి పనిచేయకుండా పోతున్నాయి. ఆపిల్ ఆపరేటింగ్ సిస్టమ్‌కు చెందిన కొన్ని వెర్షన్లలో తలెత్తిన బగ్ కారణంగా ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్ లాంటి ఆపిల్ డివైజ్‌లు క్రాష్ అవుతున్నాయి. 

‘జ్ఞా’ అనే అక్షరాన్ని ఐఫోన్లకు పంపినా లేదా టెక్స్ట్ ఎడిటర్‌లో ఎంటర్ చేసినా అది క్రాష్ అవుతున్నట్లు గుర్తించారు. ‘జ్ఞా’ అక్షరాన్ని లేదా పూర్తి కన్వర్జేషన్‌ను డిలీట్ చేసేంత వరకూ యాప్స్ మొరాయిస్తున్నాయి. ఆ అక్షరం డిలీట్ చేశాకే తిరిగి మాములుగా పని చేస్తున్నాయి. మొబైల్ వరల్డ్ అనే ఇటాలియన్ బ్లాగ్ ఈ బగ్‌ను తొలిసారి రిపోర్ట్ చేసింది. 

ఐఓఎస్ 11, మ్యాక్ ఓఎస్ హై సియెర్రా, వాచ్ ఓఎస్ 4, టీవీ ఓఎస్ 11ల్లో ఈ బగ్ తలెత్తింది. ఒక్కసారి ఈ బగ్ బారిన పడ్డారంటే ఇక మళ్లీ మళ్లీ రీస్టార్ట్ చేసినా సదరు యాప్‌లు పనిచేయడం లేదని చెబుతున్నారు. ఒకవేళ ఇలాంటి పరిస్థితి వస్తే వినియోగదారులు రీస్టార్ట్ చేసేందుకు ప్రయత్నించవద్దని నిపుణులు సూచిస్తున్నారు. అది బూట్‌లూప్‌కి కారణమై మళ్లీ డివైజ్‌లు తిరిగి ఆన్ అయ్యే అవకాశం ఉండదని చెబుతున్నారు. దీని ద్వారా హ్యాకర్లు సొమ్ములు డిమాండ్ చేసే అవకాశం ఉందంటున్నారు.

ఈ బగ్ తో ప్రస్తుతం యాపిల్ ఇంజినీర్లు కుస్తీలు పడుతున్నారు. ఈ బగ్ ను వీలైనంత త్వరగా ఫిక్స్ చేస్తున్నామని యాపిల్ కంపెనీ తెలిపింది. పాత వెర్షన్లలో ఈ సమస్య లేదని, ప్రస్తుత ఓఎస్‌లోని బీటా ఆపరేషన్ సిస్టమ్‌లో ఈ బగ్‌ను ఫిక్స్ చేశామని కంపెనీ తెలిపింది. ‘జ్ఞా’ అక్షరాన్ని రిసీవ్ చేసుకోగానే ఐమెసేజ్, వాట్సాప్, జీమెయిల్, ఫేస్‌బుక్, మెసేంజర్ లాంటి యాప్‌లు రెస్పాండ్ కావడం లేదని ఓ రిపోర్ట్ తెలిపింది. అయితే టెలీగ్రామ్, స్కైప్ వంటి యాప్‌లు దీని బారిన పడకపోవడం విశేషం. 2015లో ఇదే మాదిరిగా మరాఠీ, అరబిక్, చైనా భాషల్లోని అక్షరాలు, సంకేతాలు ఐఫోన్ మెసేజ్ యాప్‌‌ను క్రాష్ చేశాయి.


 

English Title
Apple Is Rushing To Fix The Telugu Bug

MORE FROM AUTHOR

RELATED ARTICLES