ఏపీ టెట్‌ ఫలితాలు విడుదల

Submitted by arun on Mon, 07/02/2018 - 13:03
tet

ఏపీలో ఇటీవల నిర్వహించిన టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్‌ 2018 (టెట్‌) ఫలితాలు విడుదలయ్యాయి. విశాఖపట్నం ఏయూలోని డాక్టర్‌ వైవీఎస్‌ మూర్తి ఆడిటోరియంలో ఆంధ్రప్రదేశ్‌ మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఫలితాలను విడుదల చేశారు.  57.48 శాతం మంది అభ్యర్తులు ఉత్తీర్ణత సాధించారు. ఈ పరీక్షకు 3,97,957 మంది దరఖాస్తు చేసుకోగా 3,70,573మంది హజరయ్యారని.. వారిలో 2,13,042 మంది ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు. పేపర్‌-1లో 69.36 శాతం, పేపర్‌-2ఏ సోషల్‌లో 45.1 శాతం, 2ఏ గణితం, సైన్స్‌లో 42.33 శాతం, 2ఏ లాంగ్వేజెస్‌లో 57.27శాతం, పేపర్‌ 2బీ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌లో 54.06 శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి తెలిపారు.

English Title
ap tet results 2018 released

MORE FROM AUTHOR

RELATED ARTICLES