వైసీపీ... ఓ డ్రామాల పార్టీ

వైసీపీ... ఓ డ్రామాల పార్టీ
x
Highlights

వైసీపీ... ఓ డ్రామాల పార్టీ అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. వైసీపీ ఎంపీల రాజీనామాలు కూడా డ్రామాలేనన్న చంద్రబాబు ఉపఎన్నికలు రాకూడదనే రాజీనామాలు...

వైసీపీ... ఓ డ్రామాల పార్టీ అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. వైసీపీ ఎంపీల రాజీనామాలు కూడా డ్రామాలేనన్న చంద్రబాబు ఉపఎన్నికలు రాకూడదనే రాజీనామాలు ఆమోదించుకోవడం లేదని ఆరోపించారు. బీజేపీ, వైసీపీ కలిసి డ్రామాలు ఆడుతున్నాయన్న చంద్రబాబు స్పీకర్‌ను కలిసి రాజీనామాలు ఆమోదించకుండా కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజీనామాలు ఆమోదించుకుని వస్తే టీడీపీ సత్తా ఏంటో చూపిస్తామన్నారు. ఉపఎన్నికలు వచ్చుంటే బీజేపీ, వైసీపీని చిత్తుచిత్తుగా ఓడిస్తామన్న చంద్రబాబు 2019 ఎన్నికలు ఎలా ఉండేవో ఇప్పుడే తేలిపోయేదన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories