స్టేషన్ లో సీమకోళ్లు...సీమకోళ్లను పెంచుతున్న పోలీసులు

x
Highlights

జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సీమకోళ్ల అంశం ఇప్పుడు నగరంలో చర్చనీయాంశంగా మారింది. అవును స్టేషన్ లో సీమకోళ్లు ఏంటనే డౌట్ వస్తుందా. ఏదో నేరంలో...

జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సీమకోళ్ల అంశం ఇప్పుడు నగరంలో చర్చనీయాంశంగా మారింది. అవును స్టేషన్ లో సీమకోళ్లు ఏంటనే డౌట్ వస్తుందా. ఏదో నేరంలో కోళ్లను అక్కడకు తీసుకురాలేదు. కానీ రెండు సీమకోళ్లు మాత్రం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో డ్యూటీ చేస్తున్నాయి.

ఓ గదిలో రెండు సీమకోళ్లు పక్కనే ట్రాఫిక్ కానిస్టేబుల్ ఏంటి సీమకోళ్లు ఏవైనా ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించాయా సిగ్నల్ పడ్డా ఈ కోళ్లు ఏమైనా పట్టించుకోకుండా వెళ్లాయా అనే డౌట్ వస్తుందా ఈ గదిలో ఇలా బందీ అయిన కోళ్లును చూస్తే ఇలాంటి డౌట్లు రావడం కాయం. అయితే ఈ సీమ కోళ్లు పనిష్మెంట్ లో భాగంగా ఇక్కడికి రాలేదు. ఈ రెండు సీమ కోళ్లు కూడా డ్యూటీలోనే ఉన్నాయి. అవును మన నగరం నడిబోడ్డునే జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో ఈ కోళ్లు ఆన్ డ్యూటీలో ఉన్నాయి.

వింటానికి కాస్త విడ్డూరంగా ఉన్నా జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఈ కోళ్లు డ్యూటీ చేస్తున్నది నిజంగా నిజం. అయితే ట్రాఫిక్ డ్యూటీ మాత్రం కాదు. ఈ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో పాముల బెడద ఎక్కువగా ఉంది. గత వారం ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ రూములో రెండు నాగుపాములు కనిపించాయి. వాటిని తరిమేందుకు పోలీసులు ఇలా సీమకోళ్ల ఫార్ములా ఉపయోగిస్తున్నారు.

ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ భవనం అంతా పురాతనంగా ఉండటంతో చెట్లు పెరిగి ముళ్లపొదలు, చెట్లతో అడవిలా మారింది. ఓవైపు రకరకాల కేసుల్లో పట్టుకున్న వాహనాలన్ని అక్కడ పడేయడంతో అక్కడి చెట్ల పొదల్లో నుంచి పాములు వస్తున్నాయి. వాస్తవానికి బంజారాహిల్స్ లో కమాండ్ కంట్రోల్ రూంలో నిర్మాణ పనులు జరుగుతుండటంతో అక్కడ ఉన్న ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ను తాత్కాలికంగా ఓ పురాతన భవనంలో నిర్వహిస్తున్నారు. అక్కడ పాముల బెడద ఎక్కువగా ఉండటంతో సీమ కోళ్లతో చెక్ పెట్టాలనుకున్నారు. పాముల వస్తే వాటిని పట్టించి జూకు తరలించాలి కానీ ఇలా కోళ్లను పెంచడమేంటని స్టేషన్ లో సీమకోళ్లను చూసిన జనం అనుకుంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories