గూగుల్ ఆండ్రాయిడ్‌ 'పై' వచ్చేసింది

Submitted by nanireddy on Wed, 08/08/2018 - 07:59
android-oreo’s-rollback-protection-required-phones-launching-android-pie

టెక్నాలజీ ప్రియులకు గూగుల్‌ శుభవార్త అందించింది. తన ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌(ఓఎస్‌)లో కొత్త వెర్షన్‌ ‘పై’ను మంగళవారం అందుబాటులోకి తెచ్చింది. గూగుల్ ఆండ్రాయిడ్‌ ఓఎస్‌ సిరీస్‌లో ఇది తొమ్మిదవది. ఈ వర్షన్లోని స్మార్ట్ ఫోన్ ను ఎలా వాడుతున్నారు, ఎంత సేపు వాడుతున్నారు, మితిమీరిన వాడకాన్ని నియంత్రించడానికి ఈ “Digital Wellbeing” అందుబాటులో ఉంది కొన్ని అప్లికేషన్లపై రోజుకు ఎంత సమయం వెచ్చిస్తున్నారో ఈ “Digital Wellbeing Dashboard” ద్వారా తెలుసుకోవచ్చు. ఒకవేళ అప్లికేషన్ ను ఇంత సమయం కన్నా ఎక్కువసేపు వాడకూడదనుకుంటే అలా కూడా సమయాన్నివ్ కూడా సెట్ చేసుకోవచ్చు. అలాగే ఆండ్రాయిడ్ ఈ పై లో ఈ వాడని అప్లికేషన్లు బాక్గ్రౌండ్ లో రన్ అవ్వకుండా ఆటోమేటిక్ గా నియంత్రిస్తుంది. మొబైల్స్‌ లో సమాచార గోప్యత లోపాలపై భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో గూగుల్‌ ‘పై’ ఓఎస్‌లో ప్రైవసీకి పెద్దపీట వేసింది.

English Title
android-oreo’s-rollback-protection-required-phones-launching-android-pie

MORE FROM AUTHOR

RELATED ARTICLES