బీజేపీ ఓట‌మికి కార‌ణం అదే

Submitted by lakshman on Wed, 03/14/2018 - 20:40
UP By-Election Results 2018

యూపీలో జరిగిన లోక్ సభ ఉపఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలైన విష‌యం తెలిసిందే.  ఓటమిపై మాట్లాడిన ఆ రాష్ట్ర సీఎం యోగి ఆధిత్య‌నాథ్ అతి విశ్వ‌స‌మే కొంప‌ముంచిద‌ని అన్నారు. కానీ యూపీలో బీజేపీ ఓట‌మిపాలు కావ‌డానికి రక‌ర‌కాల కార‌ణాలు ఉన్నాయ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. 
 గ‌తఏడాది  ఉత్తరప్రదేశ్ లో మరో ఘోరం జరిగిపోయింది. ఫరూకాబాద్ లోని రామ్ మనోహర్ లోహియా చిన్న పిల్లల ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక పోవటం, ఇతర కారణాలతో 49 మంది చిన్నారులు చనిపోయారు. 49 మందిలో.. 30 మంది పిల్లలు తక్కువ బరువుతో ఉన్నారని డాక్టర్లు చెబుతున్నారు. 
వరస మరణాలపై ఫరూకాబాద్ ఆస్పత్రి వర్గాలు నోట్ విడుదల చేశారు. పసిపిల్లలు చనిపోయింది వాస్తవమే అని.. అయితే ఇతర ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించిన తర్వాత ఇక్కడికి తీసుకొస్తున్నారని చెప్పారు. అప్పటికే పరిస్థితి చేయిదాటిపోయిందని వెల్లడించారు. అయితే అదే ఆస్పత్రిలో పుట్టిన 19 మంది శిశు మరణాలపై మాత్రం నోరు విప్పటం లేదు వైద్యులు. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే పిల్లలు చనిపోతున్నారని బాధిత కుటుంబాలు చెబుతున్నాయి. దీనిపై యూపీ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఫరూకాబాద్ ఆస్పత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్ తోపాటు సూపరింటెండెంట్ పై కేసు నమోదు చేసింది. జిల్లా కలెక్టర్ ను బదిలీ చేసింది. యూపీ రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో శిశు మరణాలు రోజు రోజుకు వివాదంగా మారుతోంది. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవటం లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
ఈ ఉప ఎన్నిక‌ల్లో  గోర‌ఖ్ పూర్ వైద్య నిర్లక్ష్యం వల్ల వందలాది మంది చిన్నారులు ఆక్సిజన్‌ అందక చనిపోవడం, మత ఘర్షణలను రెచ్చగొట్టడం వంటి చర్యలతో యోగి సర్కార్‌ అప్రతిష్ట మూటగట్టుకుంది. మాయావతి నేతృత్వంలోని బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బిఎస్పీ)తో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ఎన్నికల అవగాహన చేసుకోవడంతో సామాజిక సమీకరణలు కూడా ఎస్పీకి కలిసిసొచ్చాయి. 2019 సాధారణ ఎన్నికలకు రీహార్సల్స్‌గా భావించిన ఈ ఎన్నికల్లో బీజేపీ  ఓటమి పాలమవ్వడంతో జాతీయ రాజకీయాల్లో కొత్త సమీకరణలకు దారితీసింది. 

English Title
UP and Bihar By Election Result

MORE FROM AUTHOR

RELATED ARTICLES