పేస్ బుక్ లో అనసూయ ... ఆడుకుంటున్న కుర్రాళ్ళు..!

Submitted by arun on Sat, 06/16/2018 - 12:44
Anasuya Bharadwaj

బుల్లితెర, వెండితెర ప్రేక్షకులకు సుపరిచితం అనసూయ. యాంకర్‌గా యువత గుండెల్లో పరుగులు పెట్టించిన ఈమె.. వెండితెరపై కాలుమోపి సక్సెస్ బాటలో సాగుతోంది. ఇటీవలే వచ్చిన ‘రంగస్థలం’ సినిమాలో ‘రంగమ్మత్త’గా విలక్షణ పాత్ర పోషించి ప్రేక్షకలోకాన్ని మెప్పించడంతో.. ఆమె క్రేజ్ ఒక్కసారిగా రెట్టింపయ్యింది. దీంతో ఆమెకు వరుస అవకాశాలు తలుపు తడుతున్నాయి. అయితే అనసూయ గురించి సోషల్ మీడియా లో తనకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. అయితే ఇప్పడు తాజాగా అనసూయ పేస్ బుక్ లైవ్ లోకి రావడం తో అనసూయ ను ఆంటీ అని ఆడుకుంటున్నారు. 

అన‌సూయ ధ‌రించే డ్రెస్ ల‌పై..వేసుకునే పొట్టి నిక్క‌ర్ల‌పై హ‌ద్దులు దాటి కామెంట్లు అప్ప‌ట్లో చేసారు. వీటికి ధీటైన సమాధానాలు ఇచ్చినా యాంటి వ‌ర్గం ముందు అన‌సూయ ప‌ప్పులుడ‌క‌లేదు. చివ‌రికి అన‌సూయ చే క‌న్నీళ్లు పెట్టించ‌నిదే యాంటీ వ‌ర్గం నిద్ర‌పోలేదు. అయితే తాజాగా మ‌రోసారి సోష‌ల్ మీడియా ఫ్యాన్స్ అన‌సూయ‌ను రెచ్చ‌గొట్టారు. అన‌సూయ లైవ్ ఫేస్ బుక్ చాట్ లోకి రాగానే చాలా మంది కుర్రాళ్లు హాయ్ అన‌సూయ ఆంటీ బాగున్నావా? మీ బాబు ఎలా ఉన్నాడు? ఎంత వ‌య‌సు? స‌్కూల్ కి వెళ్తున్నాడా? లేడా? అంటూ ఇష్ట‌మొచ్చిన్న‌ట్లు కామెంట్లు చేసారు.

వీటిలో కొన్నింటికి కూల్ గా స‌మాధానం ఇచ్చినా…ఆంటీ అన్న మాట‌కు అన‌సూయ‌కు ఎక్క‌డో మండింది. ఆంటీ ఏంటి? మీరే అంకుల్స్ లా ఉన్నారు. నాది ఆంటీ వ‌య‌సు కాదు…మీదే అంకుల్ ఏజ్. ఇలాంటి మాట‌లు,…కామెంట్లు క‌ట్టిపెట్టండని గుసాయించింది. హ్యాపీగా స‌మాధానాలిద్దామ‌నుకున్న అన‌సూయ మ‌న‌సు ఆ ఒక్క మాట‌కు కృంగిపోయింది. గుండె బ‌రువెక్కిన స‌మాధానాలు ఇచ్చింది. అయినా కుర్రాళ్లు ఆగుతారా? చెప్పండి? ఆన‌సూయ పిచ్చి కాక‌పోతే!

English Title
Anasuya Fires Back at a Fan on FB LIVE

MORE FROM AUTHOR

RELATED ARTICLES