అమృతకు మద్రాసు హైకోర్టు షాక్..

అమృతకు మద్రాసు హైకోర్టు షాక్..
x
Highlights

తాను తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత కుమార్తెనంటూ అమృత అనే మహిళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే అమృత జయలలిత కూతురు అనేందుకు...

తాను తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత కుమార్తెనంటూ అమృత అనే మహిళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే అమృత జయలలిత కూతురు అనేందుకు తగిన ఆధారాలు లేనందున ఆమె పిటిషన్ ను కొట్టివేసింది కోర్టు. జయ తనకు జన్మనిచ్చిన తల్లి అని, తను జయ జయలలిత, నటుడు శోభన్‌బాబుకు జన్మించినట్లు తన కుటుంబీకులు చెప్పారని పేర్కొంటూ. డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహిస్తే ఈ విషయం స్పష్టమవుతుందని, ఆమెభౌతికకాయానికి మళ్లీ అంత్యక్రియలు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలంటూ గతంలో అమృత హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి దీనిపై తగిన వివరణ ఇవ్వాలంటూ తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించారు. ప్రభుత్వం తరఫున హాజరైన న్యాయవాది.. అమృత జయ కుమార్తె కాదని, అందుకు సంబంధించిన వీడియో ఆధారాలను ధర్మాసనం ముందుంచారు. ఇరువాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్‌ వైద్యనాథన్‌.. అమృత పిటిషన్‌ను తోసిపుచ్చారు. ఆమె జీవితం ఒక మిస్టరీగా మిగిలిపోయిందని పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories