బాహుబలి 2 తో పోటీ ప‌డ‌నున్న అజ్ఞాతవాసి

Submitted by arun on Sun, 01/07/2018 - 14:03

అజ్ఞాతవాసి పై ట్రేడ్ పండితులు లెక్క‌లు మొద‌లెట్టేశారు. ఎన్నిథియేట‌ర్లు, ఎన్నిషోలు, ఈస్ట్ ఎంత వెస్ట్ ఎంత వ‌సూలు చేస్తుంది. బాహుబ‌లి రికార్డ్ ల‌ను క్రాస్ చేస్తుందా అని అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. ఏ లెక్క‌లు ఎలా ఉన్నా సినిమా రికార్డ్ స్థాయిలో క‌లెక్ష‌న్లు రాబ‌డుతుంద‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. జ‌న‌వ‌రి 9 న విడుద‌ల కానున్న నేప‌థ్యంలో సినిమా టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నట్లు టాక్. ఇక అమెరికాలో అయితే అజ్ఞాతవాసి హ‌డావిడి అంతా ఇంతా కాదు. ఎప్పుడెప్పుడు సినిమా చూసేద్దామా అన్న‌ట్లుగా అడ్వాన్స్ బుక్కింగ్ ల  కోసం ఎగ‌బ‌డుతున్నారు. 

దాదాపు 457 స్క్రీన్స్ లలో జనవరి 9న సినిమా ప్రీమియర్స్ షోలు ప్రదర్శించబడనున్నాయి. జనవరి 10న ఎర్లీ మార్నింగ్ షోలు ,తెలుగురాష్ట్రాల్లో.   జనవరి 9న  ప్రీమియ‌ర్ షోలు ఉంటాయని టాక్. ఇదిలా ఉంటే సినిమా ఓపెనింగ్ హైరేంజ్ లు ఉంటాయ‌ని ఎనలిస్ట్ లు చెబుతున్నారు. బాహుబలి 2 తో అజ్ఞాతవాసి   క‌లెక్ష‌న్ల‌ను పోలుస్తున్నారు. బాహుబ‌లి 2 తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రూ.45 కోట్లు, అమెరికా  ప్రిమియర్ షోలతో దాదాపు 2.5 మిలియన్ డాలర్లను రాబట్టింది. మ‌రి  అజ్ఞాతవాసి ఆస్థాయి రికార్డుల‌ను రాబ‌డుతుందా లేదా అని తెలియాల్సి ఉంది. 

English Title
Agnyaathavaasi vs Baahubali

MORE FROM AUTHOR

RELATED ARTICLES