భార్య ముందే డైరెక్టర్ చెంప చెళ్ళుమనిపించిన నటి

Submitted by arun on Thu, 10/11/2018 - 12:31

బాలీవుడ్ దర్శకుడు సుభాష్ కపూర్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని వర్ధమాన నటి గీతిక త్యాగి ఆరోపించింది. అంతేకాకుండా, భార్య ముందే దర్శకుడి చెంప పగలగొట్టింది. దీన్నంతటినీ వీడియోగా చిత్రీకరించి యూట్యూబ్ లో పోస్ట్ చేసింది. ఈ వీడియో కొందరికైనా కనువిప్పు కావాలన్నదే తన ఉద్దేశమని పేర్కొంది. బాలీవుడ్‌లో వచ్చిన ‘జాలీ ఎల్‌ఎల్‌బీ’ దర్శకుడు సుభాష్‌ కపూర్‌ తనను లైంగికంగా వేధించాడని గీతిక ఆరోపిస్తున్నారు. సుభాష్‌కు ఎడమ చేయి లేదు. అయినప్పటికీ ప్రతిభతో మంచి కాన్సెప్ట్‌తో సినిమాలు తీస్తారని బాలీవుడ్‌లో అతనికి పేరుంది. కానీ సుభాష్‌ నిజ స్వరూపం ఇది అంటూ ఆయనకు సంబంధించిన ఓ వీడియోను గీతిక ట్విటర్‌ ద్వారా పంచుకున్నారు. సుభాష్‌ ఎలాంటివాడో చెప్పడానికి గీతిక అతన్ని, అతని భార్య డింపుల్‌ను ఓ స్టూడియోకు రమ్మన్నారు.

ఏడుస్తున్న తన భార్యతో అసలేమీ జరగలేదని సుభాష్ సంజాయిషీ ఇచ్చుకుంటుండగా, సుభాష్ అబద్ధాలు చెబుతున్నారని ఆరోపిస్తూ, ఆమె ముందే అతని చెంపపై కొట్టింది గీతిక. వాస్తవానికి గీతిక పోస్టు చేసిన వీడియోలో, సుభాష్ ను తిడుతున్నట్టు మాత్రమే కనిపిస్తున్నప్పటికీ, అక్కడి సీసీ కెమెరాల్లో ఆమె కొడుతున్న దృశ్యం రికార్డు అయి బయటకు వచ్చింది. ఇప్పుడు ఈ వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

English Title
actress Geetika Tyagi slapping director Subhash Kapoor for sexual misconduct

MORE FROM AUTHOR

RELATED ARTICLES