కేటీఆర్‌ను సర్‌ప్రైజ్ చేసిన నటుడు సుబ్బరాజు

Submitted by arun on Sat, 08/04/2018 - 13:45
ktr

తెలంగాణ మంత్రి కేటీఆర్‌ను నటుడు సుబ్బరాజు సర్‌ప్రైజ్ చేశారు. శుక్రవారం రాత్రి ఫ్యామిలీ ఫంక్షన్లో పాల్గొన్న మంత్రిని సుబ్బరాజు కలిశారు. ఇందులో సర్‌ప్రైజ్ ఏముందని అనుకుంటున్నారా..? ‘రాత్రి ఫ్యామిలీ ఫంక్షన్లో ఉండగా.. సుబ్బరాజు నా దగ్గరికి నడుచుకుంటూ వచ్చాడు. సీఎం రిలీఫ్ ఫండ్‌ కోసం చెక్ అందజేశార’ని కేటీఆర్ తెలిపారు. మంచి మనసుతో స్పందించినందుకు థ్యాంక్స్ బ్రదర్ అంటూ ఆయన సుబ్బరాజును ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. ఇటీవ‌ల టాలీవుడ్ యంగ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ త‌న‌కి వ‌చ్చిన మొద‌టి ఫిలిం ఫేర్ అవార్డుని వేలం వేసి ఆ వ‌చ్చిన డ‌బ్బుని సీఎంఆర్ ఎఫ్‌కి విరాళంగా ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు సుబ్బ‌రాజు కూడా త‌న‌కి తోచినంత సాయం చేశాడు. ఓ ఫంక్ష‌న్‌లో కేటీఆర్‌ని క‌లిసి చెక్కును అందించాడు సుబ్బ‌రాజు. ఈ విష‌యాన్ని కేటీఆర్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశారు. గత రాత్రి ఓ ఫ్యామిలీ ఫంక్ష‌న్‌కి వెళ్ల‌గా, సుబ్బ‌రాజు నా ద‌గ్గ‌ర‌కి న‌డుచుకుంటూ వ‌చ్చి ఆశ్చ‌ర్య‌ప‌ర‌చాడు. అంతేకాదు ఆయ‌న సీఎం రిలీఫ్ ఫండ్‌గా చెక్కుని అందించారు. మీ సాయానికి కృత‌జ్ఞ‌త‌లు బ్ర‌ద‌ర్ అంటూ ట్వీట్ చేశారు కేటీఆర్‌.
 

English Title
actor subbaraju surprises telangana minister ktr

MORE FROM AUTHOR

RELATED ARTICLES