గీతగోవిందం @ 50 రోజులు.. ఎన్ని సెంటర్లో తెలిస్తే..?

Submitted by nanireddy on Wed, 10/03/2018 - 16:39
59centers-50-days-geethagovindham-movie

పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి  తరువాత గీతగోవిందం సినిమాతో భారీ హిట్ ను సాధించాడు హీరో విజయ్ దేవరకొండ. ఫస్ట్ టైం 100 కోట్ల క్లబ్ చేరి అగ్రనటుల సరసన నిలిచాడు. ఈ సినిమా రేపటితో(గురువారం) 50 రోజులు పూర్తిచేసుకోనుంది. అంతేకాదు 59 సెంటర్లలో 50 రోజులు ఆడిన రికార్డు కూడా సాధించింది. ఇటీవల కాలంలో 50 రోజులు ఆడిన సినిమాలు చాలా తక్కువే ఉన్నాయని చెప్పాలి. అందులో 'రంగస్థలం', 'భరత్ అనే నేను' 'అభిమన్యుడు' సినిమాలు 50 రోజులు ఆడటమే కాక కలెక్షన్ల పరంగా మంచి రికార్డే సాధించాయి. ఈ కోవలో గీత గోవిందం కూడా చేరింది.  ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం 100 కోట్లకు పైగానే గ్రాస్ వసూలు చేసి 70 కోట్ల షేర్ సాధించింది. విజయ్ దేవరకొండ నటన, రష్మిక అభినయం, పరశురామ్ టేకింగ్ కలిసి ఈ చిత్రాన్ని ఎక్కడికో తీసుకెళ్లాయి. గీత ఆర్ట్స్2 పతాకంపై అల్లుఅరవింద్ సమర్పణలో బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మించాడు. యువత సినిమా తరువాత  చెప్పుకోదగ్గ హిట్ లేక తహతహలాడుతున్న పరశురామ్ ఈ చిత్రం విజయంతో ఆనందంలో ఉన్నాడు.  

English Title
59centers-50-days-geethagovindham-movie

MORE FROM AUTHOR

RELATED ARTICLES