ఇందిరాగాంధీపై జైట్లీ సంచలన వ్యాఖ్యలు

Submitted by arun on Mon, 06/25/2018 - 17:40
ar

దేశంలో ఎమర్జెన్సీ విధించి సోమవారానికి సరిగ్గా 43 ఏళ్లు గడిచింది. ఈ సందర్భంగా కాంగ్రెస్‌పై మాటల యుద్ధానికి దిగింది బీజేపీ. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వరుస ట్వీట్లలో ఇందిరపై విమర్శలు గుప్పించారు. ఆమెను జర్మనీ నియంత హిట్లర్‌తో పోల్చారు. హిట్లర్, ఇందిర ఎప్పుడూ రాజ్యాంగాన్ని గౌరవించలేదు. కానీ అదే రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని నియంతృత్వంగా మార్చారు. హిట్లర్ మెజార్టీ ప్రతిపక్ష సభ్యులను అరెస్ట్ చేసి తన మైనార్టీ ప్రభుత్వాన్ని పార్లమెంట్‌లో 2/3 వంతు మెజార్టీ సాధించేలా చేశారు అని జైట్లీ ట్వీట్ చేశారు.

హిట్లర్‌కు మాదిరిగానా ఇందిరా గాంధీ సైతం ఆనువంశిక ప్రజాస్వామ్యంగా దేశాన్ని మార్చారని విమర్శించారు. ఎమర్జెన్సీ రోజుల్లో దేశమంతా భయం గుప్పిట్లో చిక్కుకుందని, రాజకీయ కార్యకలాపాలన్నీ నిలిచిపోయాయని అన్నారు. మీడియాపై ఆంక్షలు విధించారని, అసమ్మతి నేతలను ముఖ్యంగా విపక్ష పార్టీల కార్యకర్తలు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను టార్గెట్ చేసుకున్నారనీ, అయినప్పటికీ వారు నిరంతర సత్యాగ్రహాలతో స్వచ్ఛందంగా అరెస్టయ్యారని మరో ట్వీట్‌లో జైట్లీ పేర్కొన్నారు. అప్పట్లో ఇందిరాగాంధీ విపక్షాలు దేశాన్ని స్థిరపరచే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపిస్తూ ప్రజల ప్రాథమిక హక్కులను రద్దు చేశారని, 353వ అధికరణ కింద దేశంలో ఎమర్జెన్సీ విధించారని అన్నారు. కాగా, జైట్లీ జర్మనీ నియంత హిట్లర్‌తో ఇందిరాగాంధీని పోల్చడంపై కాంగ్రెస్ భగ్గుమంది. 'బ్లాగ్‌లకు రాసుకోవడం కాదు...ముందు మీరు పని చేయండి' అంటూ చురకలు వేసింది.

English Title
On 43rd anniversary of Emergency, Arun Jaitley compares Indira Gandhi to Hitler

MORE FROM AUTHOR

RELATED ARTICLES