తిరుపతి లడ్డు ప్రసాదం ప్రాముఖ్యత

Submitted by lakshman on Wed, 09/13/2017 - 19:48

దైవ ప్రసాదాల్లో తిరుపతి లడ్డుది ప్రత్యేక స్థానం. తిరుపతి వెళ్లి తిరిగొస్తూ లడ్డు ప్రసాదం తీసుకురాకపోతే ఏదో కోల్పోయినట్లు చాలామంది భావిస్తుంటారు. అంతలా తిరుమల శ్రీవారి లడ్డుకు దేశ వ్యాప్తంగా పేరుంది. రుచిలో, సువాసనలో తిరుమల లడ్డుతో సరితూగే ప్రసాదం లేనేలేదు. అందుకే తిరుమల లడ్డుకు పేటెంట్ రైట్స్ కూడా పొందటం జరిగింది. అంటే ఈ లడ్డు తయారీని ఎవరూ అనుకరించకూడదని అర్థం. తిరుమల ఆలయంలో పల్లవుల కాలం నుంచే ఈ లడ్డు ప్రసాదాలు మొదలయ్యాయని చరిత్ర చెబుతోంది. శ్రీవారికి నైవేద్య వేళలు ఖరారు చేసి, ఆ సమయాల్లోనే భక్తులకు ప్రసాదాలు పంచేవారు.

అప్పట్లో కొండమీద భోజన సదుపాయాలు ఉండేవి కావు. ఈ ప్రసాదాలే భక్తుల ఆకలి తీర్చేవి. అప్పటికి ఇప్పటికి తిరుమల లడ్డుకు డిమాండ్ ఎంతో ఉంది. పదిహేనేళ్ళ క్రితం ఎన్ని కావాలంటే అన్ని అమ్మేవారు. ఇప్పుడు ఆ సదుపాయం లేదు. ఈ లడ్డు తయారీ కోసం ప్రత్యేకమైన పద్ధతులను పాటిస్తారు. ఈ ప్రసాదం తయారీ కోసం స్వచ్ఛమైన శనగ పిండి, పటిక బెల్లం, నెయ్యి, ఎండు ద్రాక్ష, యాలుకలు, జీడీపప్పు, కర్పూరం మొదలైన పదార్ధాలు ఉపయోగిస్తారు. రాష్ట్ర పర్యటనలకు దేశవిదేశ ప్రముఖులు వచ్చినా.. విదేశీ పర్యటనలకు ఏపీ ప్రజాప్రతినిధులు వెళ్లినా లడ్డూ ప్రసాదాన్ని సదరు విదేశ ప్రముఖులకు పంపిణీ చేయడాన్ని మనం గమనించవచ్చు.

English Title
importance of tirupathi laddu prasadam

MORE FROM AUTHOR

RELATED ARTICLES