ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఆప్షన్ రాబోతోంది

ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఆప్షన్ రాబోతోంది
x
Highlights

వాట్సాప్‌ యూజర్స్‌కు ఇది నిజంగా పండగ లాంటి వార్తే. చాలామంది వాట్సాప్ వినియోగదారులు ఎప్పటి నుంచో ఓ విషయంలో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పొరపాటున మెసేజ్...

వాట్సాప్‌ యూజర్స్‌కు ఇది నిజంగా పండగ లాంటి వార్తే. చాలామంది వాట్సాప్ వినియోగదారులు ఎప్పటి నుంచో ఓ విషయంలో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పొరపాటున మెసేజ్ కానీ, మల్టీమీడియా ఫైల్ కానీ పంపిస్తే దాన్ని నిరోధించే అవకాశం ఇన్నాళ్లూ ఉండేది కాదు. ఒక్కసారి పంపితే మనకు డిలీట్ చేసే అవకాశమే ఉండదు. మనం ఎవరికి పంపామో.. వాళ్లు కచ్చితంగా దాన్ని చూస్తారు. కొన్ని సందర్భాల్లో మెసేజ్ లేదా ఫొటోను పంపించిన తర్వాత చాలామంది అనవసరంగా పంపించానే అని ఫీలవుతుంటారు. ఇలాంటి పరిస్థితి ఇకపై వాట్సాప్ యూజర్లకు ఉండదు. మనం పంపించిన టెక్ట్స్ మెసేజ్‌ను, ఫైల్స్‌ను డిలీట్ చేసే ఆప్షన్ త్వరలో అందుబాటులోకి రానుంది. ‘‘డిలీట్ ఫర్ ఎవ్రివన్’’ పేరుతో ఈ ఫీచర్‌ను వాట్సాప్‌ ప్రవేశపెట్టనుంది.

ఇప్పటికే ఈ ఫీచర్‌కు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను వాట్సాప్ టెస్ట్ చేసింది. ఈ ఫీచర్‌ను వినియోగించుకుని మనం పంపిన ఫైల్స్‌ను ఐదు నిమిషాల్లోపు డిలీట్ చేయొచ్చు. అలా చేస్తే మనం పంపిన వ్యక్తికి ఆ ఫైల్ కనిపించదు. ఐదు నిమిషాల తర్వాత డిలీట్ చేసినా ఉపయోగముండదని సంస్థ తెలిపింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లు ఈ ఫీచర్‌ను వినియోగించుకోవచ్చు. పాత సమాచారాన్ని డిలీట్ చేయడానికి ఈ ఫీచర్ పనికిరాదు.

Show Full Article
Print Article
Next Story
More Stories