ప్రత్యేక హోదా కోసం రాష్ట్రవ్యాప్తంగా కదం తొక్కిన వైసీపీ

ప్రత్యేక హోదా కోసం రాష్ట్రవ్యాప్తంగా కదం తొక్కిన వైసీపీ
x
Highlights

ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని సీఎం చంద్రబాబే నీరుగార్చారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. రాష్ట్రానికి హోదా కావాలని డిమాండ్ చేస్తూ 13 జిల్లాల...

ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని సీఎం చంద్రబాబే నీరుగార్చారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. రాష్ట్రానికి హోదా కావాలని డిమాండ్ చేస్తూ 13 జిల్లాల కలెక్టరేట్ల దగ్గర ఆందోళన చేశారు. స్పెషల్ స్టేటస్ ఏపీ ప్రజల హక్కు అని హోదా విషయంలో వెనక్కి తగ్గేది లేదని వైసీపీ నేతలు స్పష్టం చేశారు.

వైసీపీ అధినేత జగన్ ఇచ్చిన పిలుపు మేరకు ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ముందు ఆందోళన నిర్వహించారు. ప్రత్యేక ప్యాకేజీలతో మోసపోవద్దు హోదా మన హక్కు అంటూ నినదించారు. కృష్ణా జిల్లా వైసీపీ ఆఫీస్ నుంచి మల్లాది విష్ణు, పార్థసారథి నేతృత్వంలో ధర్నా చౌక్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రత్యేక హోదా అంశాన్ని చంద్రబాబు నీరుగార్చారని పార్థసారధి, మల్లాది మండిపడ్డారు. ఏపీకి హోదా డిమాండ్ చేస్తూ సబ్‌కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.

స్పెషల్ స్టేటస్ డిమాండ్‌తో గుంటూరు కలెక్టరేట్ ఎదుట వైసీపీ నేతలు చేపట్టిన ధర్నా ఉద్రిక్తతకు దారి తీసింది. హోదా కోసం వైసీపీ అలుపెరగని పోరాటం చేస్త్తోందని ఆ పార్టీ నేతలు చెప్పారు. విశాఖ జీవీఎంసీ దగ్గర వైసీపీ కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. కలెక్టర్‌‌కు వినతపత్రం సమర్పించిన ఎంపీ విజయసాయిరెడ్డి ప్రత్యేక హోదా విషయంలో వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్ దగ్గర చేపట్టిన ధర్నాలో ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. హోదా కోసం మొదట్నుంచీ వైసీపీ పోరాడుతుంటే చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టడంలో బిజీగా ఉన్నారని విమర్శించారు.


హోదా వచ్చే వరకు వైసీపీ పోరాడుతుందని వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డి అన్నారు. కడపలో వైసీపీ చేపట్టిన ధర్నాకు కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ వైసీపీ కార్యకర్తలు కర్నూలులో కదం తొక్కారు. వేలాది మంది కార్యకర్తలు కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. హోదాపై బాబు మాట మార్చినా, జగన్ తన మాటకు కట్టుబడి పోరాటం చేస్తున్నారని చెప్పారు.

చంద్రబాబు అసమర్ధత వల్లే ఏపీకి హోదా రావడం లేదని అనంతపురం వైసీపీ నేతలు విమర్శించారు. బాబుకు చిత్తశుద్ధి ఉంటే ఎన్డీయే నుంచి బయటకు రావాలన్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో కలెక్టరేట్ ఎదుట వైసీపీ నేతలు చేపట్టిన ధర్నాకు కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. అటు చిత్తూరు జిల్లాలో చేపట్టిన ధర్నాలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. వ్యక్తిగత లాభం కోసం చంద్రబాబు ప్యాకేజీ జపం చేస్తున్నారని విమర్శించారు. నెల్లూరు కలెక్టరేట్ దగ్గర చేపట్టిన ధర్నాలో.. ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డితో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కలెక్టర్ కు వినతిపత్రం అందించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories