6వ రోజుకి చేరిన వైసీపీ ఎంపీల ఆమరణ దీక్ష

Submitted by arun on Wed, 04/11/2018 - 11:07
YSRCP MPs

ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ వైసీపీ ఎంపీలు చేపట్టిన దీక్ష ఆరో రోజుకు చేరుకుంది. ఈ నెల ఆరు నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న మిథున్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డిల ఆరోగ్యం బాగా క్షీణించినట్టు వైద్యులు తెలిపారు. ఈ రోజు ఉదయం వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు బ్లడ్ శ్యాంపిల్స్ సేకరించారు. శరీరంలో డీ హైడ్రేషన్స్ పెరుగుతూ ఉండటంతో  తక్షణమే దీక్ష విరమించి వైద్యానికి సహరించాలంటూ డాక్టర్లు సూచించారు. ఇందుకు నిరాకరించిన ఎంపీలు దీక్ష కొనసాగిస్తామంటూ ప్రకటించారు. ఢిల్లీలో ఎంపీలు చేస్తున్న దీక్షలకు సంఘీభావం రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు నిరసనలు నిర్వహిస్తున్నాయి.  నిన్న రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ రహదారుల దిగ్భందం నిర్వహించిన కార్యకర్తలు ఈ రోజు రైల్ రోకో చేపట్టాయి. పలు చోట్ల ట్రాక్ లపై ఎర్ర జెండాలు కట్టి రైళ్లను నిలిపివేశారు.   

English Title
ysrcp mps mithunreddy and avinashreddy hunger strike 6th day

MORE FROM AUTHOR

RELATED ARTICLES