ముగ్గురు ఆస్పత్రిలో...ఇద్దరు వేదికపై...

ముగ్గురు ఆస్పత్రిలో...ఇద్దరు వేదికపై...
x
Highlights

ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా వైసీపీ ఎంపీలు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఐదో రోజుకు చేరుకుంది. ఈ నెల ఆరు నుంచి ఎంపీలు మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డి తమ...

ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా వైసీపీ ఎంపీలు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఐదో రోజుకు చేరుకుంది. ఈ నెల ఆరు నుంచి ఎంపీలు మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డి తమ దీక్ష కొనసాగిస్తున్నారు. పార్టీకి చెందిన మొత్తం ఐదుగురుఎంపీలు దీక్షకు దిగినా ఆరోగ్యం క్షీణించడంతో రెండో రోజు మేకపాటి రాజమోహన్ రెడ్డిని మూడో రోజు వర ప్రసాద్ ను , నాలుగో రోజు వైవి సుబ్బారెడ్డిలను ఆసుపత్రికి తరలించి బలవంతంగా చికిత్స అందిస్తున్నారు. దీంతో మిగిలిన ఇద్దరు ఎంపీలే దీక్ష కొనసాగిస్తున్నారు. వీరి ఆరోగ్య పరిస్ధితిని డాక్టర్లు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఈ రోజు ఉదయం వీరిద్దరికి వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు నీరసంగా ఉన్నట్టు తెలియజేశారు. ఆరోగ్య పరిస్ధితి దృష్ట్యా దీక్ష విరమించాలంటూ డాక్టర్లు సూచించినా అందుకు వీరు తిరస్కరించారు. ఓ వైపు దీక్షలతో ఢిల్లీలో ప్రత్యేక హోదా పోరాటాన్ని ఉదృతం చేసిన వైసీపీ ఏపీలోనూ తన పోరాటాన్ని మరింత ముమ్మరం చేసింది. కేంద్రం వైఖరిని నిరసిస్తూ ఏపీలోని జాతీయ రహదారులు దిగ్భందానికి పిలుపునిచ్చింది. దీంతో పాటు నియోజకవర్గాల వారిగా రిలే నిరాహార దీక్షలు, ర్యాలీలు చేపట్టింది.

Show Full Article
Print Article
Next Story
More Stories