చిన్న మెదడు చిట్లింది

Submitted by arun on Thu, 08/02/2018 - 12:57
roja

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడిపై నగరి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా నిప్పులు చెరిగారు. గురువారం ఉదయం విలేకరులతో మాట్లాడారు. బాబుకు చిన్నమెదడు చిట్లిపోయిందని, అందుకే అర్ధం పర్ధం లేని మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. వైఎస్ జగన్ పోరాటం కారణంగానే చంద్రబాబు ప్రత్యేక హోదాపై యూ టర్న్ తీసుకున్నారని ఆరోపించిన రోజా ఓటుకు నోటు కేసులో కేసీఆర్, చంద్రబాబు మధ్య రాజీకుదిర్చానని సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడీయే తెలిపారన్నారు. 2 ఎకరాల ఆసామి రూ. 250 కోట్లతో ఇళ్లు ఎలా కట్టారు? దేశంలోనే అత్యంత ధనవుంతుడైన ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఎలా మారారు? అని ప్రశ్నించారు. తన అవినితిని కప్పిపుచ్చుకోవడానికే కేంద్రంతో లాలూచిపడిన వ్యక్తి చంద్రబాబు అని ఆరోపించిన రోజా జగన్ పై పెట్టిన కేసులన్ని కుట్ర పూరితమైనవేనని కొట్టిపారేశారు. మరోవైపు తిరుమలలో వెయ్యి కాళ్ల మండపాని తిరిగి నిర్మించాలన్నారు రోజా. 

English Title
ysrcp mla roja fires on cm chandrababu

MORE FROM AUTHOR

RELATED ARTICLES