హేమాహేమిలను కలుస్తానని చెప్పి.. హేమమాలిని క‌లుస్తారా

హేమాహేమిలను కలుస్తానని చెప్పి.. హేమమాలిని క‌లుస్తారా
x
Highlights

ఏపీ సీఎం చంద్ర‌బాబు పై వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాద‌వ్ మండిప‌డ్డారు. తమ పార్టీకి చెందిన ఎంపీలు ఎన్డీఏపై 12సార్లు అవిశ్వాస తీర్మానం పెట్టార‌ని ,...

ఏపీ సీఎం చంద్ర‌బాబు పై వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాద‌వ్ మండిప‌డ్డారు. తమ పార్టీకి చెందిన ఎంపీలు ఎన్డీఏపై 12సార్లు అవిశ్వాస తీర్మానం పెట్టార‌ని , మ‌రి టీడీపీ ఎంపీలు పార్ల‌మెంట్ లో ఏం చేస్తున్నార‌ని ప్ర‌శ్నించారు. తాము చెప్పిన‌ట్లుగానే ఏపీకి ప్ర‌త్యేక‌హోదా కోసం అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ‌పెట్టామ‌న్న ఆయ‌న ..స‌భ‌లో అన్నాడీఎంకే నేత‌లు అడ్డుప‌డుతుంటే చంద్ర‌బాబు మాట్లాడే ప్ర‌య‌త్నం ఎందుకు చేయ‌లేద‌ని అన్నారు.
ప‌క్క‌రాష్ట్ర సీఎం , నేత‌ల‌తో మాట్లాడలేని దిక్కుమాలిన సీఎం చంద్ర‌బాబు అని విమ‌ర్శించారు. రాష్ట్రం కోసం ఏదైనా చేస్తాన‌ని ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లు చేసిన చంద్ర‌బాబు కేంద్రానికి దడ పుట్టిస్తానని చెప్పి.. చివరకు ఆంధ్ర రాష్ట్ర గౌరవాన్ని పార్లమెంటు వద్ద తగ్గించారని అన్నారు. ఫోటోల పోజుల కోసం పార్లమెంటు మెట్ల ముందు వంగడం సిగ్గుచేటన్నారు. హేమాహేమిలను కలుస్తానని చెప్పి.. హేమమాలిని కలిశారని ఎద్దేవా చేశారు.
గ‌త ఎన్నిక‌ల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి గ‌తి ప‌ట్టిందో..వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీకి అదే గ‌తిప‌డుతుంద‌ని సూచించారు. ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా లడ్డులు ఇచ్చి, శాలువాలు కప్పి వచ్చారని, ఇప్పుడేమో హోదా కోసం తానే పోరాడుతున్నట్టు చెబుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబును ప్రజలు మహ్మద్‌ గజినీలా చూస్తున్నారని, ఆయనేం మాట్లాడుతారో ఆయనకే తెలియదని అన్నారు.
ఇప్ప‌టికైనా చంద్ర‌బాబు దిక్కుమాలిన డ్రామాలు ఆపి ప్ర‌త్యేక‌హోదా కోసం చిత్త‌శుద్ధితో పోరాడాల‌ని అన్నారు. త‌మ ఎంపీలు రాజీనామాల్ని ఆమోదింప‌చేసుకొని ఉపఎన్నిక‌ల్లో గెలిచే స‌త్తా ఉంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం నాలుగేళ్లుగా పోరాటం చేస్తున్న వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామాలకు సిద్దపడ్డారని చెప్పారు. టీడీపీ ఎంపీలు కూడా రాజీనామా చేసి ఆమరణదీక్షకు రావాలని డిమాండ్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories