వైసీపీతో.. బీజేపీ దోస్తీకి సెట్ అయినట్టే

Submitted by arun on Fri, 03/09/2018 - 14:52
nda

హోదాపై హామీ వస్తే.. బీజేపీతో కలిసి నడుస్తాం అంటూ.. ఆ మధ్య వైసీపీ అధినేత జగన్ ప్రకటన చేయడం సంచలనమైంది. అప్పుడే.. బీజేపీతో.. వైసీపీకి దోస్తీ కుదిరింది అని అంతా అనుకున్నారు. ఇప్పటికి.. ఆ విషయంలో కాస్త స్పష్టత వచ్చేసింది. కేంద్రం నుంచి బీజేపీ బయటికి వచ్చేయడం.. బీజేపీకి కటీఫ్ చెప్పేయడంతో.. ఇప్పుడు బీజేపీకి అత్యవసరంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ బలమైన పార్టీ అవసరం ఉంది.

ఏపీలో బీజేపీకి అంత బలం లేదు కాబట్టి.. మరో బలమైన పార్టీ సహకారం తీసుకోవడం.. ఆ పార్టీని ఎన్డీయేలో చేర్చుకోవడంతోనే.. భవిష్యత్ రాజకీయాలు చేయగలదు. లేకుంటే.. ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీకి ప్రాతినిధ్యాన్ని మరిచిపోవాల్సిన పరిస్థితి కూడా రావొచ్చు. అందుకే.. ముందు జాగ్రత్తగా వైసీపీతో ఒక ముందస్తు ఒప్పందాన్ని బీజేపీ కుదుర్చుకుని ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

విభజన చట్టం గురించి.. ఏపీకి కేంద్రం చేసిన సాయం గురించి.. అన్ని వివరాలు చెబుతూ.. త్వరలోనే బీజేపీ నేతలు జనాల్లోకి వెళ్లే అవకాశం కూడా ఉందని అంచనా వేస్తున్నారు. అదే నిజమైతే.. అప్పుడు వైసీపీ నేతలు బీజేపీకి అండగా నిలబడితే.. పరిస్థితులు మారే చాన్స్ కూడా ఉందని విశ్లేషకులు బలంగా భావిస్తున్నారు. ఇప్పటివరకూ కేంద్రంపై పోరాటం చేస్తున్నట్టుగా మాట్లాడుతున్నా కూడా.. వైసీపీ ఎన్నడూ ఎక్కడా బీజేపీకి మాత్రం వ్యతిరేకంగా అడుగులు వేయలేదు.

దీంతో.. ముందు ముందు.. ఈ ఇద్దరి దోస్తీ ఖాయమే అనీ.. కేంద్రం నుంచి టీడీపీ ఎగ్జిట్ అవడమే ఆ దిశగా మొదటి అడుగూ అనీ.. జనం కూడా అనుకుంటున్నారు. ఈ సమీకరణాలు.. ఎన్నికల్లో ఎటువంటి ఫలితాలకు దారి తీస్తాయో!
 

English Title
YSRCP may join in NDA

MORE FROM AUTHOR

RELATED ARTICLES